am, pm కు మధ్య తేడా ఏమిటి...?

కొంతమందది amకు, pmకు మధ్య తేడా తెలీక తికమకపడుతుంటారు. లాటిన్ లో am అంటే...Special Story

Update: 2022-12-25 02:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొంతమందది amకు, pmకు మధ్య తేడా తెలీక తికమకపడుతుంటారు. లాటిన్ లో am అంటే యాంటి మెరిడియన్, pm అంటే పోస్ట్ మెరిడియన్. యాంటి మెరిడియన్ అంటే సూర్యుడు రేఖాంశాన్ని దాటకముందు అని, పోస్ట్ మెరిడియన్ అంటే రేఖాంశాన్ని దాటిన తర్వాత అని అర్థం. మనం గ్లోబ్ ను చూసినప్పుడు దానిపై అడ్డంగా, నిలువుగా గీతలు కనబడుతాయి. అడ్డు గీతలను అక్షాంశాలని, నిలువు గీతలను రేఖాంశాలని అంటారు. సూర్యుడు దాటే గీతలు నిలువు గీతలన్నమాట. అంటే రేఖాంశాలు. సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడితే మధ్యాహ్న సమయమైందని, వాలుగా పడితే సాయంత్రమయిందనీ అర్థం చేసుకోవాలి. అదే ఒక్క ముక్కలో చెప్పుకుంటే 12 am అంటే రాత్రి పన్నెండనీ, 12 pm అంటే పగలు పన్నెండని అర్థం. 


Similar News