health tips: నెలరోజులు చక్కెర తినడం మానేస్తే.. బెనిఫిట్స్ ఇవిగో..
రుచిలో తియ్యగా ఉండొచ్చు కానీ.. చక్కెరను అధికంగా వాడితే హెల్త్ పరంగా చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.
దిశ, ఫీచర్స్ : రుచిలో తియ్యగా ఉండొచ్చు కానీ.. చక్కెరను అధికంగా వాడితే హెల్త్ పరంగా చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే ఈరోజుల్లో చాలా మందికి షుగర్ లేనిదే పొద్దు గడవదు. ఉదయాన్నే టీ, కాఫీ మొదలు రాత్రి పడుకునే వరకు మధ్య మధ్యలో తీసుకునే అనేక పదార్థాల్లోనూ చక్కెర ఉంటుంది. కొందరు రాత్రిభోజనం తర్వాత కూడా స్వీట్లు తింటుంటారు. కానీ ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి చక్కెరను తీసుకోవడం మాని వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 15 నుంచి నెల రోజులపాటు చక్కెరను తీసుకోవడం మానేసినా లేదా తగ్గించినా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
రోజువారీ ఆహారల్లో చక్కెరను తగ్గించడంవల్ల చర్మం దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. చక్కెరకు బదులు తేనే, స్టీవియా లేదా బార్లీ సైరప్ వంటివి తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో షుగర్ లెస్ ఫుడ్ హాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అధిక చక్కెర వాడకం కొందరిలో కంటి చూపును కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మానేయడంవల్ల దృష్టిలోపాలు తలెత్తకుండా ఉంటాయని, రక్త నాళాల్లో సమస్యలు, వాపులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.