మీరు టెక్నాలజీ ఉచ్చులో చిక్కుకున్నారా? ఈ టూల్‌తో తెలుసుకోవచ్చు!
దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ ఎరాలో ఊహకందని విషయాలు కూడా చాలా సింపుల్‌గా జరిగిపోతున్నాయి. సాంకేతికత తెచ్చిన విప్లవాత్మక మార్పులు సమయంతో పాటు వ్యయాన్ని ఆదా చేస్తున్నాయి.
దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ ఎరాలో ఊహకందని విషయాలు కూడా చాలా సింపుల్‌గా జరిగిపోతున్నాయి. సాంకేతికత తెచ్చిన విప్లవాత్మక మార్పులు సమయంతో పాటు వ్యయాన్ని ఆదా చేస్తున్నాయి. కానీ ప్రతి ఆవిష్కరణ వెనుక మంచితో పాటే చెడు కూడా ఉంటుంది. ఈ మేరకు పెద్ద పెద్ద డేటా టెక్ కంపెనీలు యూజర్ల నుంచి పెద్ద ఎత్తున డేటా సేకరిస్తుంటాయి. ఇందుకోసం పలు యాప్ బ్రౌజర్స్‌ను సందర్శించే థర్డ్ పార్టీ వెబ్‌సైట్లలో తరచుగా జావాస్క్రిప్ట్ కోడ్‌ను ఎలా ఇంజెక్ట్ చేస్తాయో సెక్యూరిటీ రీసెర్చర్, మాజీ గూగుల్ ఎంప్లాయ్ ఫీలిక్స్ క్రాస్ వివరించారు. అవి ఎలాంటి సమాచారాన్ని తీసుకుంటున్నాయో చూడగలిగేందుకు InAppBrowser.com అనే వెబ్‌సైట్‌ను నిర్మించాడు.
ఫీలిక్స్ డిజైన్ చేసిన కొత్త వెబ్‌సైట్.. బిగ్ టెక్ కంపెనీలు తమకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని చూడగలుగుతున్నాయో యూజర్లు తెలుసుకోవచ్చు. ఈ సరికొత్త InAppBrowser కంపెనీలు డేటాను సేకరించే వివిధ పద్ధతులను వినియోగదారులకు చూపుతుంది. ఇది ఏదైనా యాప్‌లో వెబ్‌సైట్‌ను తెరవడం ద్వారా అలా చేయగలదు. అయినప్పటికీ ప్రతి యాప్‌లోని బ్రౌజర్.. ఎలాంటి డేటాను సేకరిస్తుంది లేదా ఎలా బదిలీ అవుతుంది లేదా ఉపయోగించబడుతుందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు యూజర్లకు ఏ ఒక్క మార్గం లేదని ఫిలిక్స్ హెచ్చరించారు.
టూల్‌ను ఎలా ఉపయోగించాలి?
ఈ టూల్‌ను తనిఖీ చేయాలనుకుంటే.. ముందు మీకు నచ్చిన యాప్‌లో https://inappbrowser.com/ని కాపీ చేసి పేస్ట్ చేయండి. లింక్‌ను ఎవరికైనా సెండ్ చేసినప్పుడు దాన్ని యాప్‌లో తెరవడానికి లేదా మీ ప్రొఫైల్ బయోని జోడించడానికి అనుమతిస్తుంది. Instagram, Twitter, Facebook సహా చాలా యాప్‌లు ప్రకటనలు అందిస్తాయి. మీకు నచ్చిన బ్రౌజర్‌కి మిమ్మల్ని మళ్లించడానికి బదులుగా యాప్ బ్రౌజర్‌లో తెరవబడతాయి. ఇది యాప్‌లో అంశాలను బ్రౌజ్ చేయడాన్ని సులభతరం చేసినప్పటికీ, మీరు డివైస్‌లో లింక్‌ను అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు మీరు చూడగలిగేలా, మీ డేటాను యాక్సెస్ చేయడానికి ఈ యాప్‌లకు పరపతిని అందిస్తుంది