Achieve Goal: ఏదో ఒకటి కాదు.. అనుకున్నదే సాధించండి..!

చాలామందికి జీవితంలో సరైన లక్ష్యం అనేది ఉండదు.

Update: 2024-12-11 07:30 GMT

దిశ, ఫీచర్స్: చాలామందికి జీవితంలో సరైన లక్ష్యం అనేది ఉండదు. ప్రతీ వ్యక్తి కూడా ఏదో చెద్దామని, తాము అనుకున్న దానిలో విజయం సాధించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాటి గురించి కలలు కంటారు. కానీ, ఆ కలను సాకారం చేసుకునే వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటుంది. ఎవరైతే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిలో విజయం సాధిస్తారో సమాజం వారి గురించి తెలుసుకుంటుంది, మాట్లాడుకుంటుంది. అటువంటి వాళ్ల పేరు చరిత్రలో నిలిచిపోతాయి. కొందరు అది అవ్వాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ప్రగల్భాలు పలుకుతారు. కానీ, దానికి తగిన కృషి చెయ్యరు. ఇలాంటి వారు.. జీవితంలో ఫెల్యూర్‌గానే విగిలిపోతారు. లక్ష్యం కోసం కృషి చేసే వారిని మాత్రమే విజయం వరిస్తుందని తెలుసుకోవాలి.

అనుకున్నదే సాధించండి:

కొందరు ఒక నిర్థిష్టమైన లక్ష్యాన్ని ఎన్నడూ ఎంచుకోరు. సందర్బాన్ని బట్టి, పరిస్థితుల ప్రభావం వల్ల వారి లక్ష్యాలను మార్చుకుంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో వారు విజయం సాధించలేరు. లక్ష్యాలను ఎప్పుడూ కూడా అవసరాన్ని బట్టి మార్చుకోకూడదు. ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురైనా సరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. అదే అసలైన విజయం. లక్ష్యం లేకుండా ప్రగల్భాలు మాత్రమే పలుకుతూ ఉంటే వారు తమ జీవితంలో చాలా కోల్పోవాల్సి ఉంటుంది. విజయం అనేది కేవలం మాటల్లో మాత్రమే చేతల్లో కూడా ఉండాలి. లక్ష్య సాధనకై నిరంతరం కృషి చేయాలి.

కొందరు అవకాశం కోసం ఎదురు చేస్తుంటారు. ఇలా చేయడం కంటే మీరే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లడం అలవాటు చేసుకోవాలి. అది విజయానికి మార్గాన్ని సూచిస్తుంది. ఉత్సాహం, చురుకుదనం, సాధించాలనే కసి మాత్రం ఉంటేనే సరిపోదు. వీటన్నింటినీ మించి కష్టపడే తత్వం ఉండాలి. జీవితంలో సరైన లక్ష్యం లేకుండా ఏదో ఒకటి చేద్దాంలే అనుకునే వారు ఎప్పుడూ

కూడా ఖాళీగానే ఉంటారు. కొందరు చేయడానికి పని ఏమీ లేదని ఇంట్లోనే ఖాళీగా కూర్చుని ఉంటారు. అలా చేస్తున్న వారు జీవితంలో ఎదగకుండా అలాగే ఉండిపోతారు. ఎలాంటి పరిస్థితులలోనైనా వచ్చే అవకాశాలను అందుకుంటూ.. అనుకున్న లక్ష్యంపైపు అడుగులు వేస్తుంటేనే విజయం సాధించగలరు.

కష్టపడే సమయంలో విశ్రాంతి తీసుకుంటే.. విశ్రాంతి తీసుకునే సమయంలో కష్టపడాల్సి వస్తుంది. అందుకే వయస్సు మీ చేతుల్లో ఉన్నప్పుడే విజయంవైపు పరుగులు తీయండి. మీ కలలను సాకారం చేసుకోండి. అబద్ధపు మాటలు, చేష్టలు ఎక్కడో ఒక చోట మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కానీ, కష్టం, వాస్తవం మాత్రం చివరి వరకు మీతోనే నిలిచి, మీ జీవితంలో సంతోషాలను నింపుతాయి. ముఖ్యంగా మీ మన్ససును కంట్రోల్‌లో ఉంచుకోండి. ఎప్పుడైతే మీ మనసు మీ కంట్రోల్‌లో ఉంటుందో అప్పుడే మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. ఇది విజయాన్ని అందుకునేందుకు సహాయపడుతుంది.

Tags:    

Similar News