పాకిస్తాన్ ముందు యావరేజ్ స్కోరు.. టీమిండియా ప్లాన్ ఏంటీ..?
దిశ, వెబ్‌డెస్క్: దాయాదుల మధ్య జరుగుతున్న బిగ్‌ఫైట్‌లో టీమిండియా యావరేజ్ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్‌లో వచ్చిన రోహిత్ (0), కేఎల్ రాహుల్ (3), సూర్య కుమార్ యాదవ్ (11)లు దారుణంగా విఫలమయ్యారు. ఈ ప్రభావం స్కోరు బోర్డుపై పడింది. దీంతో స్కోరు బోర్డు ముందుకు కదలడమే కష్టంగా మారింది. అప్పటికే క్రీజులోకి వచ్చిన కోహ్లీ వికెట్ కాపాడుకుంటూ వచ్చాడు. ఇదే […]
దిశ, వెబ్‌డెస్క్: దాయాదుల మధ్య జరుగుతున్న బిగ్‌ఫైట్‌లో టీమిండియా యావరేజ్ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్‌లో వచ్చిన రోహిత్ (0), కేఎల్ రాహుల్ (3), సూర్య కుమార్ యాదవ్ (11)లు దారుణంగా విఫలమయ్యారు. ఈ ప్రభావం స్కోరు బోర్డుపై పడింది. దీంతో స్కోరు బోర్డు ముందుకు కదలడమే కష్టంగా మారింది.
అప్పటికే క్రీజులోకి వచ్చిన కోహ్లీ వికెట్ కాపాడుకుంటూ వచ్చాడు. ఇదే సమయంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీకి తోడుగా తన వంతు కృషి చేశాడు. 30 బంతుల్లో (39) పరుగులు తీసి పెవిలియన్ చేరాడు. దీంతో 84 పరుగులకే నాలుగో వికెట్ కోల్పోయింది భారత్.
ఆ తర్వాత కాస్తా వేగాన్ని పెంచిన కోహ్లీ 45 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్ రవీంద్ర జడేజా కూడా 13 పరుగులకే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌గా హార్దిక్ వచ్చిన కాసేపటికే షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో విరాట్ (57) పరుగుల వద్ద కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక డెత్ ఓవర్‌లలో క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా (11) పరుగులకు ఔట్ అయ్యాడు. భువనేశ్వర్ (5), షమీలో(0) క్రీజులో ఉండగా నిర్ణీత ఓవర్లు ముగిశాయి. దీంతో 7 వికెట్ల నష్టానికి భారత్ 151 పరుగులు చేసింది.
After losing two wickets in the first three overs, Virat Kohli and Rishabh Pant steadied the innings for #India#Pakistan need 152 to win! #INDvPAK #T20WorldCup
— ESPNcricinfo (@ESPNcricinfo) October 24, 2021