వాయు ‘గండం’ కలవరపెడుతోంది !
దిశ, ఏపీ బ్యూరో: ఏపీని బంగాళాఖాతంలో వాయుగుండం కలవరపెడుతోంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో కుంభవృష్టిగా వానలు కురుస్తున్నాయి. 24గంటల్లో వాయుగుండం మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని ఆదివారం విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీని బంగాళాఖాతంలో వాయుగుండం కలవరపెడుతోంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో కుంభవృష్టిగా వానలు కురుస్తున్నాయి. 24గంటల్లో వాయుగుండం మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని ఆదివారం విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తీరం వెంబడి 55నుంచి 75కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు.