ములుగులో అద్భుతం.. కలలో వచ్చిన దేవుడు.. దొరికిన బంగారు విగ్రహం..!

దిశ, వాజేడు : దేవుడు కలలో కనిపించి పలానా ప్రదేశంలో గుప్త నిధులు, ధనరాశులు ఉన్నాయని చెబితే సరిగ్గా అక్కడే లభ్యం అయ్యాయని పలానా వ్యక్తులు చెప్పినట్లు చిన్నపుడు పుస్తకాల్లో మనందరం చదివే ఉంటాం. ఇలాంటివి నిజంగా మన లైఫ్‌లో జరిగితే ఎంత బాగుండు అనుకునే వాళ్లు ప్రస్తుత రోజుల్లోనూ చాలా మందే ఉన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ గుప్త నిధుల కోసం ఎక్కడో చోట తవ్వకాలు జరుపుతున్నారు. పోలీసులకు దొరికి కటకటలా పాలవుతున్నారు. […]

Update: 2021-06-04 10:38 GMT

దిశ, వాజేడు : దేవుడు కలలో కనిపించి పలానా ప్రదేశంలో గుప్త నిధులు, ధనరాశులు ఉన్నాయని చెబితే సరిగ్గా అక్కడే లభ్యం అయ్యాయని పలానా వ్యక్తులు చెప్పినట్లు చిన్నపుడు పుస్తకాల్లో మనందరం చదివే ఉంటాం. ఇలాంటివి నిజంగా మన లైఫ్‌లో జరిగితే ఎంత బాగుండు అనుకునే వాళ్లు ప్రస్తుత రోజుల్లోనూ చాలా మందే ఉన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ గుప్త నిధుల కోసం ఎక్కడో చోట తవ్వకాలు జరుపుతున్నారు. పోలీసులకు దొరికి కటకటలా పాలవుతున్నారు. మన దేశంలో బ్లాక్ మ్యాజిక్‌ను నమ్మేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇలాంటివి కట్టుకథలు అని మనం కొట్టిపారేసినా.. ములుగు జిల్లాలో జరిగిన ఓ ఘటన నిజమా..? అబద్ధమా..? అనే కొత్త సందేహాన్ని రేకేత్తిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పన పల్లి గ్రామంలో ‘మల్లన్న దేవుడి’ బంగారు విగ్రహం బయటపడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ముప్పన పల్లికి చెందిన బిల్లా నారాయణ కల(Dreams)లోకి దేవుడు వచ్చి పలానా ప్రదేశంలో ‘మల్లన్న విగ్రహం’ ఉన్నట్లు చెప్పాడని, అక్కడ తవ్వి చూడగా నిజంగానే ‘మల్లన్న బంగారు విగ్రహం’ బయటపడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ విగ్రహాన్ని బిల్లా నారాయణ వారింట్లోని పూజ గదిలో పెట్టి పూజలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, అది పురాతన విగ్రహం అని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటికు పొక్కడంతో స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు దీనిపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా, అసలు ఆ విగ్రహం నిజంగానే భూమిలో లభ్యమైందా లేదా నరహరి ఎక్కడి నుంచి ఐనా తెచ్చిపెట్టి గ్రామస్తులను నమ్మిస్తున్నాడా అనేది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News