త్వరలోనే కొత్త ఆహార భద్రత కార్డులు : మంత్రి గంగుల
దిశ, పటాన్ చెరు: త్వరలో కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయడానికి పూర్తిస్థాయిలో స్క్రూట్నీ పూర్తిచేసి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ నుండి మంత్రి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు, రైస్ మిల్లులకు తరలింపు, చెల్లింపులు, కొత్త ఆహార భద్రత కార్డుల జారీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ […]
దిశ, పటాన్ చెరు: త్వరలో కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయడానికి పూర్తిస్థాయిలో స్క్రూట్నీ పూర్తిచేసి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ నుండి మంత్రి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు, రైస్ మిల్లులకు తరలింపు, చెల్లింపులు, కొత్త ఆహార భద్రత కార్డుల జారీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. జిల్లాలో గత సంవత్సరం యాసంగిలో 56 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా, ఈ యాసంగిలో అంతకు మూడు రెట్లకు పైగా ధాన్యం వచ్చిందన్నారు. ఈ యాసంగి (2020-21)లో 35,372 మంది రైతుల నుండి రూ.336.56 కోట్ల విలువగల 1,76,672 (లక్షా 76 వేల 672) మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రికి వివరించారు.
33,638 మంది రైతులకు రూ.316.49 కోట్లు వారి వారి ఖాతాలో జమ చేశామని కలెక్టర్ తెలిపారు. ఇంకా 1,734 మంది రైతులకు 17 కోట్ల రూపాయలు ఒకటి రెండు రోజుల్లో జమ చేయనున్నట్లు మంత్రికి చెప్పారు. ధాన్యం మొత్తం మిల్లింగ్ కోసం 19 బాయిల్డ్ రైస్ మిల్స్‌కు తరలించామని, జిల్లాలో ఆహారభద్రత కార్డుల కొరకు కొత్తగా 12,969 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. పరిశీలన స్క్రూట్నీ, పూర్తయిందని అర్హులను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుండి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డి.ఎం.సుగుణ బాయి, వ్యవసాయ శాఖ జెడీ నర్సింహరావు, డిప్యూటీ తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.