ఈటల రాజీనామాపై వీడని ఉత్కంఠ..

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. శుక్రవారం మీడియా ముందు తాను టీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి కూడా ఉంచుకోను అని కామెంట్ చేశారు. అయితే, రాజేందర్ శనివారం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాన్ని పంపిస్తారని ప్రచారం జరిగింది. కానీ, […]

Update: 2021-06-05 11:13 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. శుక్రవారం మీడియా ముందు తాను టీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి కూడా ఉంచుకోను అని కామెంట్ చేశారు. అయితే, రాజేందర్ శనివారం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాన్ని పంపిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా సాగుతోంది.

వారికో న్యాయం..

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో జాయిన్ చేసుకోవడంలో సఫలమైంది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు.14 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి జట్టుకట్టి టీఆర్ఎస్‌లో చేరలేదని, విడుతల వారిగా చేరారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్న వాదనలు కూడ తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన తరువాత రెండింట మూడో వంతు మంది చేరారు కావున పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు కదా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే, వారంతా ఒకేసారి టీఆర్ఎస్‌లో చేరలేదన్న విషయంపై కూడా డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పై అనర్హత వేటు వేస్తే టీఆర్ఎస్ మరింత నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. టీఆర్ఎస్ పంచన చేరిన వారికో న్యాయం ఆ పార్టీని వీడిన ఈటలకో న్యాయం వర్తిస్తుందా అన్న విషయంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువాలు కప్పుకోలేదు కావున వేటు వేసే అవకాశం లేకుండా పోయిందని అన్నట్టయితే, ఈటల కూడా బీజేపీకి మద్దతిస్తూ పార్టీ సభ్యత్వం తీసుకోకుండా కాషాయం కప్పుకోకుండా ఉంటే టిట్ ఫర్ టాట్ అవుతుందంటున్న వారూ లేకపోలేదు. చివరకు రాజీనామా విషయంలో ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడక తప్పదు.

Tags:    

Similar News