గల్ఫ్ మృతుల వారసులకు ఎక్స్ గ్రేషియా
అధికారంలోకి రాగానే గల్ఫ్ గ్యారంటీ అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వందేనని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
దిశ, గంగాధర : అధికారంలోకి రాగానే గల్ఫ్ గ్యారంటీ అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వందేనని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన పేద దళిత వర్గానికి చెందిన సందరగిరి రమేష్ బతుకు తెరువు నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి హార్ట్ ఎటాక్ తో మరణించగా అతని భార్యకు కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రొసీడింగును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో గల్ఫ్ గోస విన్నాడని, అధికారంలోకి రాగానే గల్ఫ్ గ్యారంటీ అమలు చేశాడని తెలిపారు. కేసీఆర్ లాగా కల్లబొల్లి కబుర్లతో మోసం చేయలేదన్నారు. గల్ఫ్ భరోసా అంటే ఏమిటో రేవంత్ రెడ్డి అమలు చేసి చూపిస్తున్నాడని అన్నారు.