Telangana High Court : మాగనూర్, బూరుగుపల్లి ఘటనపై నివేదిక ఇవ్వండి : హైకోర్ట్
నారాయణపేట జిల్లా మాగనూర్(Maganur) జెడ్పీ పాఠశాలలో గత వారం రోజుల్లో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్(Food Poisioning) జరిగిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : నారాయణపేట జిల్లా మాగనూర్(Maganur) జెడ్పీ పాఠశాలలో గత వారం రోజుల్లో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్(Food Poisioning) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్ట్ ప్రభుత్వంపై సీరియస్ అయింది. "విద్యార్థులు చచ్చిపోతే గాని స్పందించరా..?" అంటూ మండి పడింది. ఈ వ్యవహారంపై ఏజీ వివరణ ఇస్తూ విద్యార్థులు బయట కుర్ కురేలు తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని కోర్టుకు తెలియ జేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపే ప్రయత్నం చేయగా.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని కోరింది. అలాగే మూడు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి(Burugupalli) జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై కూడా ధర్మాసనం మండిపడింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇప్పటివరకు ఫుడ్ పాయిజన్ అయిన అన్ని పాఠశాలల్లో నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపాలని, ఈ ఘటనలన్నింటి మీద సోమవారం వరకు పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది.