శ్మశానమే ఆమె నివాసం

కన్న కొడుకులు పట్టించుకోకుండా గెంటేసిన ఆ వృద్ధురాలికి శ్మశానం ఆశ్రయమిచ్చింది.

Update: 2024-11-27 08:44 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : కన్న కొడుకులు పట్టించుకోకుండా గెంటేసిన ఆ వృద్ధురాలికి శ్మశానం ఆశ్రయమిచ్చింది. మరో కొడుకు పింఛను డబ్బుల కోసం పైశాచికంగా ప్రవర్తించి నెట్టివేయడంతో విరిగిన కాలుతో శ్మశానంలోనే బతుకు నెట్టుకొస్తుంది. ఈ హృదయ విదారకమైన ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. జగిత్యాలలోని చిలుకవాడకు చెందిన రాజవ్వను కన్న కొడుకులు ఆలనపాలన చూడకుండా ఇంట్లో నుండి వెళ్లగొట్టారు.

     ముగ్గురు కొడుకులు పట్టించుకోకపోవడంతో పది రోజులుగా శ్మశానంలోనే గడుపుతూ వస్తుంది. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించి వెంటనే వృద్ధురాలికి చికిత్స అందించారు. ఆ తర్వాత సఖి కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి వృద్ధుల సంరక్షణ చట్టం కింద తగు చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి నరేష్ తెలిపారు. 


Similar News