వరల్డ్ వాక్: ప్రస్తుతం ప్రపంచదేశాలకు అదే సవాల్ గా మారిందా?
వరల్డ్ వాక్: ప్రస్తుతం ప్రపంచదేశాలకు అదే సవాల్ గా మారిందా?... World Walk: is poverty is main challenge for world countries
పలు దేశాల ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. దీంతో కొంత మేరకు పేదరికం తగ్గింది. మన దేశంలో గత 15 సంవత్సరాల కాలంలో సుమారు 415 మిలియన్ల జనాభాను పేదరికం నుంచి బయటపడేశారు. అయితే, కరోనా కాలంలో వీటికి అంతరాయం ఏర్పడి లాక్‌డౌన్, కర్ఫ్యూ కారణంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 229 మిలియన్ల జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. వీరిలో సుమారు 205 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. 2021 నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 25.01 శాతం మంది బహుముఖ పేదరికంతో బాధపడుతున్నారు. 1.3 బిలియన్ల జనాభాలో 32.75 శాతం గ్రామీణ ప్రాంతాలలో, 8.81 శాతం పట్టణ ప్రాంతాలలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి చేరుకోవడానికి భారత్ చర్యలు చేపట్టాలి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కాలంలో సుమారు 163 మిలియన్ల జనాభా పేదరికంలోకి జారుకోగా, వీరిలో సగం మంది సౌత్ ఆసియా ప్రజలే.
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, వాతావరణ స్థితిగతులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. దీంతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల జనాభా కడు పేదరికంలోకి జారిపోయే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యూఎన్‌డీపీ హెచ్చరించింది. ప్రపంచంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం మరింతగా విజృంభిస్తున్నదని అక్టోబర్ 17 'ప్రపంచ పేదరిక నిర్మూలన దినోత్సవం'(World Poverty Eradication Day) సందర్భంగా వెల్లడించిన నివేదికలో పేర్కొంది. దీనినే 'యూఎన్‌డీపీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్-2022 రిపోర్టు' (Global Multidimensional Poverty Index) 'ఆక్స్‌ఫర్డ్ పావర్టీ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్'(Oxford Poverty Development Initiative) వారు కూడా సమర్థించారు.
ప్రపంచవ్యాప్తంగా 111 దేశాలలో 1.2 బిలియన్ల మంది బహుముఖ పేదరికంతో బాధపడుతున్నారని కూడా వివరించారు. ప్రపంచంలో పేదలు ఎక్కువగా ఉన్న సబ్ సహారా ప్రాంతంలో, ఆఫ్రికాలో సుమారు 579 మిలియన్ల మంది ఉన్నారు. 84 శాతం పేదలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. రోజుకు 1.9 అనగా 2 అమెరికా డాలర్ల లోపు సంపాదన ఆధారంగా ఈ పేదరికాన్ని అంచనా వేశారు. ప్రపంచంలో కోవిడ్, యుద్ధాలు, దాడులు, ఘర్షణల వలన ఈ పేదరికం మరింత విజృంభిస్తున్నది.
Also read: వరల్డ్ వాక్: ఉగ్రవాద నిరోధకానికి ఎఫ్ఏటీఎఫ్ సంస్థ పాత్ర ఎంత?
వాటి ఆధారంగా నిర్వచించి
పలు దేశాల ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. దీంతో కొంత మేరకు పేదరికం తగ్గింది. మన దేశంలో గత 15 సంవత్సరాల కాలంలో సుమారు 415 మిలియన్ల జనాభాను పేదరికం నుంచి బయటపడేశారు. అయితే, కరోనా కాలంలో వీటికి అంతరాయం ఏర్పడి లాక్‌డౌన్, కర్ఫ్యూ కారణంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం 229 మిలియన్ల జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. వీరిలో సుమారు 205 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. 2021 నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 25.01 శాతం మంది బహుముఖ పేదరికంతో బాధపడుతున్నారు. 1.3 బిలియన్ల జనాభాలో 32.75 శాతం గ్రామీణ ప్రాంతాలలో, 8.81 శాతం పట్టణ ప్రాంతాలలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి చేరుకోవడానికి భారత్ చర్యలు చేపట్టాలి.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కాలంలో సుమారు 163 మిలియన్ల జనాభా పేదరికంలోకి జారుకోగా, వీరిలో సగం మంది సౌత్ ఆసియా ప్రజలే. డిప్రివేషన్, న్యూట్రిషన్, వంట చెరుకు, శానిటేషన్, నివాసం వంటి ఐదు అంశాల ఆధారంగా పేదరికాన్ని నిర్వచించారు. ఈ పేదలకు కనీసం ఉపాధి, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతా, సేవలు, మౌలిక సదుపాయాలు అందడం లేదు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలు, వాతావరణ మార్పుల వలన మహిళల పరిస్థితి మరింత దిగజారింది. పేదవారిని ఆకలి, పోషకాహార లోపం అనారోగ్యం వెంటాడుతూనే ఉంది. కొన్ని సందర్భాలలో అఘాయిత్యాలు, బాల్యవివాహాలు సైతం జరగడం బాధాకర విషయం. తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆహార పదార్థాల సప్లయి చైన్ సరఫరాలో అంతరాలతో ఆకలి, పేదరికం పెరిగింది.
Also read: వరల్డ్ వాక్: భారత్ సహకారం కోరుతున్న సింగపూర్ ఎందుకో తెలుసా?
అసలు కారణం అదే
'2022-స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్'(State of Food Security and Nutrition in the World 2022) రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 828 మిలియన్ల మంది జనాభా తీవ్ర ఆకలి కోరలలో చిక్కుకున్నారు. 'మల్టీ ఏజెన్సీ రిపోర్ట్-2021' ప్రకారం 2.37 మిలియన్ల జనాభాకు సరైన ఆహారం అందడం లేదు. 2017 లో ఐక్యరాజ్యసమితి 2018-2027 నాటికి ప్రపంచంలో పేదరికం తరిమేయాలని తీర్మానం చేశారు. 2016-2025 మధ్య కాలంలో పోషకాహార లోపాన్ని అధిగమించాలని నిర్ణయించారు. కానీ, కరోనా వైరస్, ప్రస్తుత రష్యా ఉక్రెయిన్ యుద్ధం, చైనా అమెరికా మధ్య కోల్డ్‌వార్‌తోపాటు వివిధ దేశాలలో దాడులు, ఘర్షణలు ఈ పేదరికాన్ని మరింతగా పెంచడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రజలందరికీ ఆహారం అందించడం మానవ హక్కులను కాపాడటమే అని హెచ్ఆర్‌సీ చెబుతున్నది. అందుచేతనే 'బ్లాక్ సి గ్రెయిన్ డీల్' ను ఆమోదించారు. అయినప్పటికీ పరిస్థితులు మారలేదు.
ఇకనైనా ప్రపంచ దేశాలు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు చిన్న, కుటీర పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావాలి. ప్రతి వస్తువుకు ఇతర దేశాలపై ఆధారపడే స్థితి నుంచి బయటపడి స్వయం సమృద్ధి సాధించుటకు మార్గాలు అన్వేషించాలి. విద్య, ఆరోగ్య రంగానికి ఎక్కువ నిధులు విడుదల చేస్తూ, వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలి. నిరుద్యోగం నిర్మూలనకు ఉపాధి హామీ పథకాలు, పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావాలి. అనుత్పాదక వ్యయాలు తగ్గించుకోవాలి. వాస్తవాల ఆధారంగా పారదర్శకంగా పాలన అందించాలి. రాజకీయ సుస్థిరతకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్లోబలైజేషన్ నేపథ్యంలో అన్ని దేశాలు ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే ఈ భూమి మీద పేదరికాన్ని పారద్రోలగలం.
ఐ. ప్రసాదరావు
63056 82733