జకాత్ ఆచరించేది అందుకే..
ముస్లింలు అతి పవిత్రంగా భావించే మాసం రంజాన్ మాసం. దైవ సన్నిధి నుండి వరాలు కురిసే మాసం రంజాన్ మాసం.

ముస్లింలు అతి పవిత్రంగా భావించే మాసం రంజాన్ మాసం. దైవ సన్నిధి నుండి వరాలు కురిసే మాసం రంజాన్ మాసం. రంజాన్ నెలలో 30 రోజుల పాటు ముస్లింలు ఉపవాసాలు పాటిస్తారు. ఈ నెలలో ప్రతి ముస్లిం పాపాలు మానుకొని పుణ్యాల వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగమే అల్లాహ్ ఆదేశం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన మార్గంలో తమ తమ ఆస్తుల నుండి జకాత్ ఇవ్వడం పరిపాటి. దివ్య ఖురాన్‌లో కూడా అనేక సార్లు జకాత్ ఇవ్వడం విదిగా పాటించాలని తద్వారా సమాజంలో ఆర్థిక సాంఘిక రుగ్మతలు దూరం అవుతాయని అల్లాహ్ అదేశించారు.
జకాత్ అంటే "శుద్ధి". తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడమని అర్థం. ఇస్లాం మతంలో తన సంపదలో కొంత భాగాన్ని (2.5%) పేదలకు, అవసరమున్న వారికి దానం చెయ్యడమే జకాత్ అత్యంత కీలకమైన అంశం. జకాత్ సంవత్సరంలో ఒకసారి చెల్లించవలసి ఉంటుంది. ఈ జకాత్ డబ్బులను పేదలకు, అనాధలకు, వితంతువులకు, అప్పులో ఉన్నవారికి తమ సంపాదనలో 2.5 శాతం ఇస్తుంటారు. ఇస్లామిక్ ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రతి సంవత్సరం ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా జకాత్ కోసం 2 ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. మన రాష్ట్ర జనాభా ప్రకారం సుమారు 44 లక్షల మంది ముస్లింలు.. ఇందులో సగం జనాభా అనగా ఇరవై లక్షల మంది సుమారు ఇరవై వేల రూపాయలు ఇచ్చినా నాలుగు వేల కోట్ల రూపాయలు జకాత్ రూపంలో ముస్లింలు ఇస్తున్నారు. ముస్లింలు ఇలాంటి విధిని పాటించడం ద్వారా సమాజంలో ధనిక పేద తేడా లేకుండా అందరూ సమానులే అనే భావం కలగాలని ఇస్లాం ముఖ్య ఉద్దేశం...!
అజీజుద్దిన్
ఎడిటర్ ఫోకస్ న్యూస్
70131 76656