ఆరు గ్యారంటీలకు భరోసా

ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శ కంగా పాలన కొనసాగిస్తూ , తాత్కా లిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను

Update: 2025-03-20 00:45 GMT
ఆరు గ్యారంటీలకు భరోసా
  • whatsapp icon

ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శ కంగా పాలన కొనసాగిస్తూ , తాత్కా లిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి సంక్షేమాన్ని సమ తుల్యం చేస్తూ ఆర్థిక మంత్రి భట్టి విక్ర మార్క 2025 -26 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.. 

తెలంగాణ రైజింగ్‌ 2050 ప్రణాళికతో, పాలనలో దార్శనికతతో, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ ప్లాన్‌ తయారీతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ తోడ్పాటును ఆందిస్తుంది.

ఆరు గ్యారంటీలకు కేటాయింపు

రూ. 3.10 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ ను రూపొందించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించారు. ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు కేటాయింపులు చేశారు. రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు చేయూత పింఛన్లుకు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు రూ.12,571 కోట్లు, గృహ జ్యోతికి రూ.2,080 కోట్లు, సన్నాల బోనస్‌కు రూ.1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కి రూ.1,143 కోట్లు, గ్యాస్‌ సిలిండర్‌ రాయితీకి రూ.723 కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి రూ.600 కోట్లు విద్యుత్ రాయితీ - రూ.11,500 కోట్లు రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు కేటాయింపులు పరిశీలిస్తే సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధత తెలియజేస్తుంది

భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్

ఆధునిక సాంకేతికత, స్థిరత్వం పట్ల తెలంగాణ నిబద్ధతను హైలైట్ చేస్తూ, ఆయన 'మెగా మాస్టర్ ప్లాన్ 2050'ను ప్రవేశపెట్టారు. వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు సాంకేతిక పురోగతి ద్వారా ఆవిష్కరణ, స్థిరమైన అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడం ఈ చొరవ లక్ష్యం. బడ్జెట్‌లో ప్రధాన ఆకర్షణ పారిశ్రామిక అభివృద్ధి కోసం మెగా మాస్టర్ ప్లాన్ 2050, ఇందులో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ క్లస్టర్‌ల స్థాపన కూడా ఉంది. పట్టణ రద్దీని తగ్గించడానికి రూ.7,032 కోట్ల వ్యయంతో 31 ఫ్లైఓవర్లు, 17 అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల మౌలిక సదుపాయాల అభివృద్దికి మార్గం సుగమం అవుతుంది. పరిశ్రమల స్దాపన ద్వారా యువతకి ఉపాధి లభిస్తుంది.

మహిళా సాధికారతకు పెద్దపీట

ప్రతి మండలంలో మహిళలతో రైస్‌ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్‌ మిల్లుల్లో మిల్లింగ్‌ చేయించటం మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యత మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు లాంటి చర్యలు మహిళా సాధికారతకు ఊతం ఇస్తాయి. ఇక విద్యను ప్రాముఖ్యతనిస్తూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు' ఏర్పాటు. మొదటి దశలో 58 స్కూళ్ల నిర్మాణానికి రూ.11,600 కోట్లు కేటాయించడం వల్ల అత్యాధునిక వసతులు, నాణ్యమైన బోధనతో విద్యార్థులకు మంచి విద్యను అందించనున్నాయి. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచింది. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తును కూడా హామీ విద్యా శాఖకు రూ.23,108 కోట్లు కేటాయింపు విద్యా రంగాన్ని బలోపేతం చేస్తాయి.

అన్నదాతకు చేయూత

రైతుల కోసం కేటాయింపులు ఈ బడ్జెట్‌లో రైతుల కోసం వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు కేటాయించగా, నీటిపారుదల శాఖకు రూ.23,373 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,674 కోట్లను కేటాయించారు. రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధిని బలోపేతం చేయడం లక్ష్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ అభయ హస్తం వంటి వివిధ పథకాలకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేయటం అన్నదాతకు చేయూత నివ్వడం ప్రభుత్వ నిబద్దతకు కొలమానం. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూనే.. వ్యవసాయం, ఆరు గ్యారంటీలు, ట్రిపులార్, ఫ్యూచర్‌ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగానే..బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

-శ్రీధర్ వాడవల్లి

99898 55445 

Tags:    

Similar News