కాంట్రాక్ట్ ప్రొఫెసర్లతో కాలయాపనా?

తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో కెల్లా ఉస్మానియా విశ్వవిద్యాలయం చాలా ప్రత్యేకం. ఎన్నో ఉద్యమాలకు పుట్టినిల్లు.

Update: 2025-03-20 18:30 GMT
కాంట్రాక్ట్ ప్రొఫెసర్లతో కాలయాపనా?
  • whatsapp icon

తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో కెల్లా ఉస్మానియా విశ్వవిద్యాలయం చాలా ప్రత్యేకం. ఎన్నో ఉద్యమాలకు పుట్టినిల్లు. ఎక్కడ అన్యాయం జరిగిన ప్రశ్నించే తత్వం ఆ మట్టిలొనే ఉంది. అలాంటి విశ్వవిద్యాలయం నేడు కాంట్రాక్ట్ ప్రొఫె సర్లతో కాలం వెళ్ళదీస్తుంది. ఓయూలో 1280 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా ఇప్పుడు కేవలం 350 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు, అందులోనూ 50 మంది సీనియర్ ప్రొఫెసర్లు మాత్రమే ఉండటం విచారకరం. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేది 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మధ్య తరగతి విద్యార్థులే.. ప్రత్యేక ప్రవేశ పరీక్ష రాసి మెరిట్ విద్యార్థులు ఉస్మానియాకి వస్తారు. రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరతతో విద్యార్థులకు రీసెర్చ్ అవకాశాలు లేవు. 50మంది ప్రొఫెసర్లు ఉండే కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో రెగ్యులర్ ప్రొఫెసర్లు 10 మంది ఉండడం. 12 మంది ప్రొఫెసర్లు ఉండే జర్నలిజం డిపార్ట్‌మెంట్‌లో ఇప్పుడు కేవలం ఒక రెగ్యులర్ ప్రొఫెసర్ ఉండడం. పురావస్తు శాస్త్రం లాంటి చిన్న డిపార్ట్‌మెంట్‌లో ఒక రెగ్యులర్ ప్రొఫెసర్ కూడా లేకపోవడం ఓయూలోని దుస్థితికి అద్దం పడుతోంది. కాంట్రాక్టు ప్రొఫెసర్లు రీసెర్చ్ గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం లేకపోవడంతో విద్యార్థులు పీహెచ్‌డీ రీసెర్చ్‌కు దూరమవుతున్నారు. నెట్‌లో మంచి మా ర్కులు వచ్చినా, ఓయూలో ప్రొఫెసర్ల కొరతతో సీట్లు కేటాయించడం లేదు. 2012లో టాప్ 10లో ఉండే ఉస్మానియా యూనివర్సిటీ 2023 వచ్చేసరికి 63వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో పేరుపొందిన ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితే ఇలా ఉంటే ఇంకా మిగతా విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏమిటి? గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను గాలికి వదిలేసింది. ప్రభుత్వ మార్పులో ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికైనా ప్రభుత్వం యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు చేపట్టి, అకడమిక్, పీహెచ్‌డీ రీసెర్చ్‌కు అవకాశాలు కల్పించాలి. ఉస్మానియా యూనివర్సిటీకి బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించి ఓయూ అభివృద్ధికి సహకరించాలి.

వడ్లకొండ వంశీకృష్ణ

99518 80649

Tags:    

Similar News