రేవంత్ పాలనలో ఎస్సీ, బీసీల రాజ్యం!

మామూలుగానే కాదు, ప్రొటోకాల్ నియమావళి ప్రకారమైనా ముఖ్యమంత్రి కుర్చీ పెద్దగా, ప్రత్యేకంగా ఉంటుంది.

Update: 2025-03-20 00:30 GMT
రేవంత్ పాలనలో ఎస్సీ, బీసీల రాజ్యం!
  • whatsapp icon

మామూలుగానే కాదు, ప్రొటోకాల్ నియమావళి ప్రకారమైనా ముఖ్యమంత్రి కుర్చీ పెద్దగా, ప్రత్యేకంగా ఉంటుంది. వేదిక ఏదైనా ఆ స్థానం గౌరవం అలాంటిది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ, బీసీల రాజ్యం వర్థిల్లుతోంది! రాష్ట్రమంతటా అణగారిన కులాల్లో సరికొత్త ధీమా తొణికిసలాడుతున్న వేళ.. స్వయానా తెలంగాణ "పెద్ద" మనసును సమాజం చూసింది. కుర్చీ చిన్నదైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయ వైశాల్యానికి చిహ్నమైంది. కుడి పక్కన టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, ఎడమ వైపున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసీనులైన సన్నివేశం తీరు పులకింపజేస్తోంది. ఎస్సీ, బీసీ నేతల మధ్య కూర్చున్న సీఎం కుర్చీ ఆ ఇద్దరి కుర్చీలకంటే చిన్నగా ఉండడమే ఇందుకు అసలు కారణం! స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రెండు బిల్లులకు ఉభయ సభల్లో ఆమోదం పొందడం ఈ ప్రక్రియలో చరిత్రాత్మక అధ్యాయం. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత బిల్లుకూ అసెంబ్లీ, మండలి ఆమోదం తెలంగాణలో ఎస్సీ, బీసీల నవశకానికి నాంది! ఇది సమ సమాజ స్థాపనలో కీలక అడుగు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత నేపథ్యంలో తనను దళిత సంఘాలు అభినందించడాన్ని పురస్కరించుకొని రేవంత్ రెడ్డి చల్లని మేలుకొలుపు సందేశం ఇచ్చారు. వర్గీకరణ ఫలాలు చిట్ట చివరి పౌరుల అనుభవంలోకి చేరాలనీ ఆకాంక్షించారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మరో పది మం దికి మేలు చేయాలంటూ హృద్యంగా పిలుపునివ్వడం ఆలోచింపజేస్తుంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ దిగ్గజం రాహుల్ గాంధీ తాపత్రయాన్ని జ్ఞాపకం చేశారు. రాహుల్ గాంధీని అభినందించాలనీ, పది లక్షల మందితో సభ తలపెట్టాలని పిలుపిచ్చారు. ఆ సభ ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్సీ వర్గీకరణకు ప్రేరణ కాగలదని ఆకాక్షించారు. అందుకు తెలంగాణ ఆదర్శం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొనడం అట్ట డుగు వర్గాల పట్ల తనకున్న నిబద్ధతకు తార్కాణం.

ఇల్లెందుల దుర్గాప్రసాద్

9440850384

Tags:    

Similar News