ఐదు వేల కొవిడ్ కిట్స్ పంపిణీ.. టెస్టుల అనంతరం అందజేత
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ పరిధిలో కొవిడ్ లక్షణాలతో బాధ పడుతున్నవారికి తొలి రోజు ఐదు వేల కొవిడ్ కిట్లను జీహెచ్ఎంసీ అందజేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్కిట్స్ కోసం ప్రత్యేకంగా వ్యవస్థను రూపొందించి అందజేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఇంటింటి ఫీవర్‌సర్వే చేపడుతున్న అధికారులు కొవిడ్ కంట్రోల్‌రూమ్‌కు వచ్చే విజ్ఞప్తులకు కూడా కొవిడ్కిట్స్ను బల్దియా అధికారులు అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇంటి వద్దకే వెళ్లి కొవిడ్కిట్స్ను అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో అధికారులు […]
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ పరిధిలో కొవిడ్ లక్షణాలతో బాధ పడుతున్నవారికి తొలి రోజు ఐదు వేల కొవిడ్ కిట్లను జీహెచ్ఎంసీ అందజేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్కిట్స్ కోసం ప్రత్యేకంగా వ్యవస్థను రూపొందించి అందజేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఇంటింటి ఫీవర్‌సర్వే చేపడుతున్న అధికారులు కొవిడ్ కంట్రోల్‌రూమ్‌కు వచ్చే విజ్ఞప్తులకు కూడా కొవిడ్కిట్స్ను బల్దియా అధికారులు అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇంటి వద్దకే వెళ్లి కొవిడ్కిట్స్ను అందిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో అధికారులు ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టిన నేపథ్యంలో అవసరమైన వారికి అక్కడే కొవిడ్ కిట్లను అందిస్తున్నారు. ఈ నెల 4న 40 వేల ఇండ్లల్లో సర్వే చేస్తే 1,487 మంది కొవిడ్లక్షణాలతో ఉన్నారని గుర్తించారు. వీరిలో 1,400 మందికి వెంటనే కోవిడ్ మందుల కిట్ అందజేశారు. మరో వైపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. అక్కడ కొవిడ్ లక్షణాలు కనిపించినా వారికి కూడా కిట్స్ అందజేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో 18,600 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,600 మందికి కొవిడ్నివారణ మందుల కిట్లను అందజేశారు. దీంతో మొత్తం ఐదు వేల మందికి జీహెచ్ఎంసీ కొవిడ్ కిట్లను జీహెచ్ఎంసీ అందజేసినట్లయింది.
కొవిడ్ కంట్రోల్ రూం ద్వారా..
జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో నియమించిన వైద్యులు 250 కాల్స్‌ను తీసుకుని సలహాలు, సూచనలు అందించారు. ఐసోలేషన్‌లో ఉంటున్నవారు కొవిడ్ కిట్స్కోసం కంట్రోల్‌రూంను సంప్రదించవచ్చు. ఇచ్చిన వివరాల ఆధారంగా సర్కిల్‌పరిధిలో నియమించిన సిబ్బంది ఇంటి వద్దకు చేరుకుంటారు. కొవిడ్ నిర్థారణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. అప్పుడే కొవిడ్ కిట్లను అందిస్తారు. వీటిల్లో జ్వరం, యాంటీ బయోటిక్, శానిటైజర్, ఒక మాస్క్అందజేస్తున్నారు. సంబంధిత డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల సిబ్బందితో కరోనా నివారణ మందులతో కూడిన కిట్‌ను అందచేస్తున్నారు. డిప్యూటీ, జోనల్ కమిషనర్లు బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్సెంటర్లలో జరుగుతున్న కొవిడ్ పరీక్షలను పరిశీలించడంతో పాటు కొవిడ్ కిట్ల అందజేతను మానిటరింగ్చేస్తున్నారు.