SRH ఖేల్ ఖతం.. ఫైనల్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ క్వాలిఫయర్-2వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతోనే ఐపీఎల్ సీజన్ 13 మాత్రమే కాకుండా ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఢిల్లీ జట్టు ఫైనల్స్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసి 190 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన ఢిల్లీ జట్టు.. విజయం వైపు దూసుకొస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును డెత్ ఓవర్లలో కట్టడి చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో SRH 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ క్వాలిఫయర్-2వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతోనే ఐపీఎల్ సీజన్ 13 మాత్రమే కాకుండా ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఢిల్లీ జట్టు ఫైనల్స్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసి 190 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన ఢిల్లీ జట్టు.. విజయం వైపు దూసుకొస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును డెత్ ఓవర్లలో కట్టడి చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో SRH 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్ వేసిన రబాడా మూడు వికెట్లు తీసుకొని ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనికి తోడు మార్కస్ స్టోయినిస్ కూడా కీలక సమయంలో 3 కీలక వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది. ఇక నవంబర్ 10న జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు- ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి పోటీనిస్తుందనడంలో సందేహం లేదు.
హైదరాబాద్ ఇన్నింగ్స్:
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ టాప్ ఆర్డర్ విఫలమైంది. మెరుపు ఇన్నింగ్స్ ఆడే క్రమంలో వికెట్లు కూడా కోల్పోయింది. 12 పరుగుల వద్ద హైదరాబాద్ జట్టు సారథి వార్నర్(2) రబాడా బౌలింగ్‌లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇదే సమయంలో ఓపెనర్ ప్రియమ్ గార్గ్ 12 బంతుల్లో 2 సిక్సర్లు కొట్టి 17 పరుగులు చేశాడు. అప్పుడే క్రీజులో కుదురుకుంటున్న గార్గ్‌ను స్టోయినిస్ 43 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే కూడా 14 బంతుల్లో 3 ఫోర్లు కొట్టి 21 పరుగులు తీశాడు. కానీ, 44 పరుగుల వద్దనే అతనూ స్టోయినిస్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 5వ స్థానంలో వచ్చిన జాసన్ హోల్డర్ (11) పరుగులకే వెనుదిరిగాడు. దీంతో 90 పరుగులకే SRH 4 వికెట్లను కోల్పోయింది.
ఇక మిడిలార్డర్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ మాత్రం కూల్‌గా ఇన్నింగ్స్ ఆడుతూ ఢిల్లీ బౌలర్లకు ఓటమి భయాన్ని కల్పించాడు. ఏకధాటిగా ఆడుతూ స్కోరు బోర్డు అమాంతం లాక్కెల్లాడు. 45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి 67 పరుగులు చేశాడు. విలియమ్సన్‌కు తోడుగా అబ్దుల్ సమద్ ఏ మాత్రం తీసిపోకుండా మెరుపు ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 33 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి SRHను గెలిపిస్తారని అనుకున్నప్పటికీ మ్యాచ్ చివరి నిమిషంలో మలుపు తిరిగింది. విలియమ్సన్ వికెట్‌తో వన్ సైడ్ అయింది. 147వ స్కోర్ వద్ద స్టోయినిస్ వేసిన బంతిని భారీ షాట్ ఆడపోయిన విలియమ్సన్ రబాడాకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత 167 పరుగుల వద్ద అబ్దుల్ సమద్ కూడా రబాడా బౌలింగ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. వీరిద్దరి వికెట్లతోనే మ్యాచ్ ఢిల్లీ వైపు తిరిగింది.
6వ స్థానంలో వచ్చి రషీద్ ఖాన్(11), శ్రీవత్సవ గోస్వామి(0) డకౌట్‌తో వెనుదిరిగారు. అప్పటికే చేయాల్సిన స్కోరు అందనంత ఎత్తులో ఉండిపోయింది. ఇక చివర్లో వచ్చిన షాబాజ్ నదీమ్ (2), సందీప్ శర్మ (2) పరుగులు చేసి క్రీజులో ఉన్నా నిర్ణీత 20 ఓవర్లు ముగిసిపోయాయి. ఇదే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 172 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 17 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఫైనల్స్‌కు చేరింది.
ఢిల్లీ ఇన్నింగ్స్:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ల్లీ 189 పరుగులు చేసింది. ఢిల్లీ నుంచి ఓపెనింగ్ వచ్చిన స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ బాది 38 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత 86 పరుగుల వద్ద రషీద్ ఖాన్ వేసిన బంతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్(21) పరుగులతో పర్వాలేదనిపించాడు.
ఇక ఓపెనింగ్ నుంచి సమిష్టిగా రాణించిన శిఖర్ ధావన్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 126 పరుగుల వద్ద అయ్యర్ క్యాచ్ ఔట్ కాగా.. 178 పరుగుల వద్ద గబ్బర్ lbwతో పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 178 స్కోర్ బోర్డు వద్ద 3 వికెట్లు కోల్పోయింది.
శిఖర్‌కు తోడుగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మేయర్ కూడా చెలరేగి ఆడాడు. 22 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ కొట్టి 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక రిషబ్ పంత్ కూడా 3 బంతులను ఎదుర్కొని 2 పరుగులు చేసేసరికి నిర్ణీత 20 ఓవర్లు ముగిశాయి. దీంతో 3 వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగులు చేయగలిగింది.
స్కోర్‌బోర్డ్:
Delhi Capitals Innings: 189-3 (20 Ov)
1. మార్కస్ స్టోయినిస్ b రషీద్ ఖాన్ 38(27)
2. శిఖర్ ధావన్ lbw b సందీప్ శర్మ 78(50)
3. శ్రేయాస్ అయ్యర్ (c)c మనీష్ పాండే b హోల్డర్ 21(20)
4. షిమ్రాన్ హెట్మేయర్ నాటౌట్ 42(22)
5.రిషబ్ పంత్ నాటౌట్ 2(3)
ఎక్స్‌ట్రాలు: 8
మొత్తం స్కోరు: 189-3
వికెట్ల పతనం: 86-1 (మార్కస్ స్టోయినిస్, 8.2), 126-2 (శ్రేయాస్ అయ్యర్, 13.6), 178-3 (శిఖర్ ధావన్, 18.3)
బౌలింగ్:
1. సందీప్ శర్మ 4-0-30-1
2. జాసన్ హోల్డర్ 4-0-50-1
3. షాబాష్ నదీమ్ 4-0-48-0
4. రషీద్ ఖాన్ 4-0-26-1
5. టి నటరాజన్ 4-0-32-0
Sunrisers Hyderabad Innings: 172-8 (20 Ov)
1. ప్రియమ్ గార్గ్ b స్టోయినిస్ 17(12)
2. డేవిడ్ వార్నర్ (c)b రబాడా 2(3)
3. మనీష్ పాండే c నొర్ట్జే b స్టోయినిస్21(14)
4.కేన్ విలియమ్సన్ c రబాడా b స్టోయినిస్ 67(45)
5. జాసన్ హోల్డర్ c ప్రవీణ్ దూబే b అక్సర్ 11(15)
6. అబ్దుల్ సమద్ c (sub)కీమో పాల్ b రబాడా 33(16)
7. రషీద్ ఖాన్ c అక్సర్ b రబాడా 11(7)
8. శ్రీవత్సవ గోస్వామి c స్టోయినిస్ b రబాడా 0(1)
9. షాబాజ్ నదీమ్ నాటౌట్ 2(3)
10. సందీప్ శర్మ నాటౌట్ 2(4)
ఎక్స్‌ట్రాలు: 6
మొత్తం స్కోరు: 172-8
వికెట్ల పతనం: 12-1 (డేవిడ్ వార్నర్, 1.1), 43-2 (ప్రియమ్ గార్గ్, 4.4), 44-3 (మనీష్ పాండే, 4.6), 90-4 (జాసన్ హోల్డర్, 11.4), 147-5 (కేన్ విలియమ్సన్, 16.5), 167-6 (అబ్దుల్ సమద్, 18.3),
167-7 (రషీద్ ఖాన్, 18.4), 168-8 (శ్రీవత్సవ గోస్వామి, 18.5)
బౌలింగ్:
1. రవిచంద్రన్ అశ్విన్ 3-0-33-0
2. కగిసో రబాడా 4-0-29-4
3. ఎన్రిచ్ నొర్ట్జే 4-0-36-0
4. మార్కస్ స్టోయినిస్ 3-0-26-3
5. అక్సర్ పటేల్ 4-0-33-1
6. ప్రవీణ్ దూబే 2-0-14-0