తల్లి రుణం తీర్చుకున్న కూతురు.. ఏం చేసిందంటే.?
దిశ, మానకొండూరు : హిందూ సాంప్రదాయ ప్రకారం ఓ తల్లి, తండ్రి మరణిస్తే పుత్రుడే చితి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, శనివారం కేషవపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో వెల్దండి కనకమ్మ అనే మహిళ మృతి చెందింది. అయితే, కనకమ్మకు ముగ్గురు కుమార్తెలున్నారు. ఈ క్రమంలో చిన్న కూతురు ఆడెపు సుజాత.. తల్లి కనకమ్మకు అంతిమ సంస్కారాలు నిర్వహించి, దహన సంస్కారాలు చేసి కొడుకు లేని లోటు తీర్చింది. ఈ సన్నివేశాన్ని చూసిన వారు […]
దిశ, మానకొండూరు : హిందూ సాంప్రదాయ ప్రకారం ఓ తల్లి, తండ్రి మరణిస్తే పుత్రుడే చితి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, శనివారం కేషవపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో వెల్దండి కనకమ్మ అనే మహిళ మృతి చెందింది. అయితే, కనకమ్మకు ముగ్గురు కుమార్తెలున్నారు.
ఈ క్రమంలో చిన్న కూతురు ఆడెపు సుజాత.. తల్లి కనకమ్మకు అంతిమ సంస్కారాలు నిర్వహించి, దహన సంస్కారాలు చేసి కొడుకు లేని లోటు తీర్చింది. ఈ సన్నివేశాన్ని చూసిన వారు ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. కూతురు సుజాతను గ్రామస్తులు అభినందించారు.