అప్పుల బాధ భరించలేక యువకుడి ఆత్మహత్య..

మండల పరిధిలోని లింగంపల్లి గ్రామానికి చెందిన కొంగళ్ల బాలరాజు (25) అనే యువకుడు అప్పుల బాధ భరించలేక గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2025-03-14 16:49 GMT
అప్పుల బాధ భరించలేక యువకుడి ఆత్మహత్య..
  • whatsapp icon

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని లింగంపల్లి గ్రామానికి చెందిన కొంగళ్ల బాలరాజు (25) అనే యువకుడు అప్పుల బాధ భరించలేక గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి రామయ్య మృతి చెందడంతో ఆనాటి నుండి కుటుంబ బాధ్యతను తన పై వేసుకున్న బాలరాజు అందుకోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగించాడు. అయినా కూడా అప్పులు తీరకపోవడంతో తాను అప్పులు తీర్చలేక పోతున్నానని తల్లితో పలుమార్లు వాపోయాడు.

గురువారం రాత్రి బయటికి వెళ్లి వస్తానని తల్లి యాదమ్మతో చెప్పి తన బొలెరో వాహనాన్ని తీసుకుని ఆరు బయటకు వెళ్లిన బాలరాజు కొంతసేపటికి తాను ఉరి వేసుకొని చనిపోతున్నట్లు సెల్ఫీ ఫోటో తీసి తన ఇరుగు పొరుగు వారికి పంపాడు. ఆ సెల్ఫీ ఫోటోలు చూసి అక్కడికి వెళ్లిన వారికి బాలరాజు తన బొలెరో వాహనానికి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతడిని కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెంది ఉందాడు. దాంతో మృతుడి తల్లి యాదమ్మ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు.


Similar News