చేపలు పడుతుండగా కరెంట్ షాక్.. వ్యక్తి మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన తగడపల్లి గ్రామ శివారులో శనివారం నాడు చోటు చేసుకుంది.

Update: 2025-03-15 15:54 GMT

దిశ,మునిపల్లి : చేపలు పట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన తగడపల్లి గ్రామ శివారులో శనివారం నాడు చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చిన్నచిల్మెడ గ్రామానికి చెందిన దూదేకుల అమీరుద్దీన్ (30), ఇదే మండలం తకడపల్లి గ్రామానికి చెందిన సద్దాం అహ్మద్ లు కలిసి తగడపల్లి గ్రామ శివారులో గల సింగూర్ బ్యాక్ వాటర్ లో కరెంటు వైర్లతో చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ తగిలి అమిరుద్దీన్ మృతి చెందాడు. మృతుని సోదరుడు దూదేకుల బషిరోద్దీన్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.

Read Also..

దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇళ్లు గుల్ల..  


Similar News