పేకాటస్థావరంపై పోలీసులు దాడి.. ఆరుగురు అరెస్టు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబడితండా శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు.
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబడితండా శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. మరో ముగ్గురు పారిపోయారు. తాళ్ల గురజాల ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబడితండా శివారు ప్రాంతంలో సోమవారం సాయంత్రం కొంతమంది పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారంతో వెళ్లి దాడి చేశారు.పేకాట బెట్టింగ్ ఆడుతున్న ఆరుగురు వ్యక్తుల్ని పట్టుకున్నారు.
పోలీసులను చూసి మరో ముగ్గురు పారిపోయారు. ఘటనా స్థలం నుంచి రూ.3630 నగదు, ఒక ఆటో, బైకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బుధా కలాన్ కు చెందిన నిధుల రమేష్, ఎండల రమేష్, రాందేని రవి, దాడి మల్లేష్, ఆవునూరి గోపి, బోయిన రవి పట్టుపడ్డారు. పారిపోయిన వారిలో దుర్గం రాజేష్, రాసకొండ తిరుపతి, ఆవునూరి శ్రావణ్ ఉన్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.