Tarun Raj: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం.. నటుడు తరుణ్ రాజ్ అరెస్ట్

గోల్డ్ స్మగ్లింగ్‌ కేసు (Gold Smuggling Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2025-03-18 04:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: గోల్డ్ స్మగ్లింగ్‌ కేసు (Gold Smuggling Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితురాలు రన్యారావు (Ranya Rao) వెనుక కింగ్‌పిన్‌గా ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజ్‌ను పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. అయితే, దుబాయ్‌ (Dubai) నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ (Customs) అధికారులకు చిక్కిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఈ స్మగ్లింగ్‌లో ఆమె సవతి తండ్రి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కె.రామచంద్రరావు (Ramachandra Rao) పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆయనను ఐఏఎస్‌ అధికారి గౌరవ్‌ గుప్తా (Gaurav Guptha) నేతృత్వంలోని ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారించింది. ఈ మేరకు ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు.

పోలీసులు అదేశాల మేరకు రామచంద్రరావును సెలవుపై వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి రేపటిలోగా నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులకు కీలక ఎవిడెన్స్ లభించింది. రన్యారావు (Ranya Rao) గోల్డ్ స్మగ్లింగ్‌ వెనుక కింగ్‌పిన్‌గా తెలుగు నటుడు తరుణ్ రాజ్ (Tarun Raj) ఉన్నాడని దర్యాప్తులో తేలింది. 2019 నుంచి వారిద్దరికీ సంబంధాలు ఉన్నట్లుగా వెల్లడైంది. పలుమార్లు తరుణ్ రాజ్‌తో కలిసి రన్యారావు దుబాయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. దుబాయ్‌లో కస్టమ్స్ తనిఖీలు తప్పించుకునేందుకు యూఎస్ పార్ట్‌పోర్ట్ ఉపయోగించాడని DRI గుర్తించింది. అదేవిధంగా యూఎస్ పాస్‌పోర్ట్ వినియోగించి రన్యారావు బంగారం తరలించిందని విచారణలో తేలింది. ఈ మేరకు ఇవాళ ఉదయం బెంగళూరు పోలీసులు తరుణ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Tags:    

Similar News