Attack: హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 130 మంది మృతి

హమాస్ (Hamas) టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ (Israel) జరిపిన మిసైల్స్ దాడుల్లో 130 మంది దుర్మరణం పాలైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Update: 2025-03-18 02:43 GMT
Attack: హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 130 మంది మృతి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హమాస్ (Hamas) టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ (Israel) జరిపిన మిసైల్స్ దాడుల్లో 50 మంది దుర్మరణం పాలైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. సుమారు 130 మందికి పైగా గాయాలయ్యాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health) ధృవీకరించింది. గాజా స్ట్రిప్, దక్షిణ లెబనాన్, సిరియాలను టార్గెట్‌గా చేసుకుని వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అయితే, ఉగ్రముప్పు ఉన్న నేపథ్యంలోనే తాము దాడులు చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. జనవరి 19న హమాస్‌ (Hamas)తో కాల్పుల విరమణ అమలు అవుతోన్న నేపథ్యంలో ఇదే అతిపెద్ద దాడిగా అక్కడి ప్రజలకు తెలిపారు. మరోవైపు యెమెన్‌ (Yemen)పై అమెరికా (America) జరిపిన దాడుల్లో డజన్ల కొద్దీ హౌతీ యోధులు మరణించారని యునైటెడ్ స్టేట్స్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్సస్ గ్రిన్‌కెవిచ్ (United States Lieutenant General Alexis Grinkevich) పేర్కొన్నారు. మరణించిన వారిలో ఐక్యరాజ్యసమితికి చెందిన పిల్లల సంస్థ యునిసెఫ్ (UNICEF)కు చెందిన ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వయస్సు గల పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు.రు. 

Tags:    

Similar News