ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన మై హోమ్ సిమెంట్ లారీ..

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కేంద్రంలోని మెయిన్ రోడ్డు పై మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు చెందిన లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేళ్లచెరువులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

Update: 2025-03-17 16:11 GMT
ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన మై హోమ్ సిమెంట్ లారీ..
  • whatsapp icon

దిశ, మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కేంద్రంలోని మెయిన్ రోడ్డు పై మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు చెందిన లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేళ్లచెరువులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన పెద్దవరపు అంజి పోస్ట్ ఆఫీస్ లో టెంపర్ ఉద్యోగిగా, పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం మేళ్లచెరువు నుండి పల్సర్ బైక్ పై సొంత గ్రామమైన వేపల సింగారానికి వెళుతుండగా మేళ్లచెరువు హీరో హోండా షోరూం వద్దకు రాగానే అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మై హోమ్ సిమెంట్ కు చెందిన లారీ ఢీ కొట్టడంతో అంజి స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు మృతికి కారణమైన లారీ మై హోమ్ సిమెంట్ పరిశ్రమ చెందింది కావడంతో మై హోమ్ సిమెంట్ ఎదుట మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మై హోమ్ సిమెంట్ గేట్ ఎదుట మృతుని భార్యతో పాటు బంధువులు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.


Similar News