లారీ బీభత్సం.. చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గోపాలపురంలో ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టింది..

దిశ, అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గోపాలపురంలో ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు గాయాలయ్యాయి. పిల్లలను బస్సులో ఎక్కించుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.