వృద్దురాలిని కబళించిన లారీ
దైవ దర్శనానికి వెళ్తూ కొబ్బరికాయ కోనేందుకు రోడ్డు దాటుతున్న వృద్దురాలిని మృత్యువు లారీ రూపంలో కబలించిన ఘటన సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ రాజీరాదారిపై చోటు చేసుకుంది.

దిశ, తిమ్మాపూర్ : దైవ దర్శనానికి వెళ్తూ కొబ్బరికాయ కోనేందుకు రోడ్డు దాటుతున్న వృద్దురాలిని మృత్యువు లారీ రూపంలో కబలించిన ఘటన సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ రాజీరాదారిపై చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం నేదునూర్ గ్రామానికి చెందిన ఎలగందుల లచ్చవ్వ నల్లగొండ లో జరిగే జాతరకు వెళ్లేందుకు రేణికుంట రాజీవ్ రహదారి వద్దకు వచ్చింది.
కాగా దేవునికి కొబ్బరికాయ కొట్టాలనే ఆలోచన రావడంతో రోడ్డు దాటి కిరాణా షాపులో కొబ్బరికాయ కొని మళ్లీ రోడ్డు దాటుతున్న సమయం లో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఆమెను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.