ఆ యువకుడి మృతికి అసలు కారణం అదేనా..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక యువకుడు మృతి చెందాడు.

Update: 2025-03-22 16:34 GMT
ఆ యువకుడి మృతికి అసలు కారణం అదేనా..
  • whatsapp icon

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక యువకుడు మృతి చెందాడు. జడ్చర్లకు చెందిన రవీంద్ర అనే యువకుడు తన కుటుంబ భూ వివాదంతో శుక్రవారం రాత్రి పారాసెటమాల్ - 625 మాత్రలు ఒకేసారి వేసుకోగా అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తీసుకురాగా అక్కడి వైద్యులు చికిత్స అందించారు. శనివారం ఉదయం కోలుకొన్నాడని కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు.

మధ్యాహ్నం 'నాక్' అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉండగా, ఆ ఇంజెక్షన్ ఆసుపత్రిలో అందుబాటులో లేనందున, బయట తీసుకురావాలని డాక్టర్ స్వరూప్ రాశాడని, రవీంద్ర స్నేహితుడు బయట మందుల షాపులో కొనుగోలు చేసి తీసుకురాగా మేల్ మెడికల్ వార్డులో డ్యూటీలో ఉన్న ఓ నర్స్ ఇంజెక్షన్ ఇచ్చిన కొంత సేపటికే రవీంద్రకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చాయన్నారు. దీంతో రవీంద్ర మృతి చెందాడని మృతుని తమ్ముడు శర్వన్న ఆరోపించాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే రవీంద్ర చనిపోయాడని బంధువులు ఆరోపిస్తూ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు, ఆదివారం పోస్టుమార్టం నిర్వహిస్తే కాని నిజానిజాలు బయటపడతాయని సీఐ ఇజాజోద్దిన్ తెలిపారు.


Similar News