AP: రూ.8 కోట్లు అప్పులు చేసి.. వ్యాపారి అదృశ్యం
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మరో వ్యాపారి అదృశ్యమయ్యాడు.

దిశ ప్రతినిధి, నరసరావుపేట : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో మరో వ్యాపారి అదృశ్యమయ్యాడు. ఆర్డీవో ఆఫీసుకు వెళ్లే మెయిన్ రోడ్డులో ఉన్న మొబైల్స్ షాపునకు మూడు రోజులుగా తాళాలు వేసి ఉన్నాయి. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఆ వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నరసరావుపేట చుట్టుపక్కల మొబైల్స్ వ్యాపారి దాదాపు రూ.8 కోట్ల మేర అప్పులు చేసినట్లు పట్టణంలో ప్రచారం నడుస్తోంది. మొబైల్ వ్యాపారి అదృశ్యంతో అతనికి అప్పులు ఇచ్చినవారు కలవరపడుతున్నారు. ఇటీవల నరసరావుపేటలో వరుసగా వ్యాపారులు ఐపీలకు రావడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.