Bribe: ఏసీబీ వలలో స్కూల్ ప్రిన్సిపల్
ఏసీబీ వలకు స్కూల్ ప్రిన్సిపల్ చిక్కారు...

దిశ, వెబ్ డెస్క్: అవినీతి మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులను చేతులు చాపేలే చేస్తోంది. రాష్ట్రంలో ఏదో ఓ చోట కలకలం రేపుతోంది. బల్లకింద చేయి పెట్టి ఏసీబీ అధికారులకు చిక్కుతోంది. ఇలాంటి ఘటన తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగింది. చీమకుర్తి ట్రైబర్ వెల్ఫేర్ బాయ్స్ స్కూలు ప్రిన్సిపల్ రూ. 17,500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. స్కూల్లో పని కోసం ఆశ్రయించిన వ్యక్తిని ప్రిన్సిపల్ లంచం డిమాండ్ చేశారు. పని పూర్తి కావాలంటే తనకు లంచం ఇవ్వాలని చెప్పారు. దీంతో ఏసీబీ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పథకం ప్రకారం ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్‌ను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. శాఖా పరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.