Breaking: ఏపీలో తెలంగాణ పోలీసుల హడావుడి.. ఒంగోలు వన్ టౌన్ పీఎస్‌కు తరలింపు
ఏపీలో తెలంగాణ పోలీసులు హడావుడి చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో తెలంగాణ పోలీసులు(Telangana Police) హడావుడి చేశారు. విజయ్ భాస్కర్(Vijay Bhaskar) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు(Ongole)కు హైదరాబాద్ మాదాపూర్(Madhapur) పోలీసులు వెళ్లారు. అయితే నిందితుడి ఫోన్ లోకేషన్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు(MLA Damacherla Janardhan Rao) ఇంట్లో చూపిస్తోంది. దీంతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. కానీ ఎమ్మెల్యే కుటుంబం ఇంట్లో లేదు. పని మనిషిని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులను ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే ‘విజయ్ భాస్కర్ ఎవరు..?, హైదరాబాద్ మాదాపూర్‌లో ఏం చేశారు. అసలు కేసేంటి?, ఒంగోలు ఎందుకు వెళ్లారు. ఎమ్మెల్యే ఇంటి పని మనిషిని ప్రశ్నించాల్సిన అవసరమేంటి..?.’ అనే ప్రశ్నలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసులతో ఒంగోలు వన్ టౌన్ పోలీసులు చర్చిస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.