దమ్ముంటే నా కుర్చీ టచ్ చెయ్.. బాలినేనికి వెంకాయమ్మ సవాల్
దమ్ముంటే తన కుర్చీని టచ్ చెయాలని బాలినేని శ్రీనివాసరెడ్డికి జడ్పీ చైర్ పర్సన్ వెంకాయమ్మ సవాల్ విసిరారు..
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర మాజీ సీఎం జగన్(Former Cm Jagan)పై పిఠాపురం(Pithapuram)లో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ(Janasena Party 12th founding meeting)లో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి(Former Ongole MLA Balineni Srinivasa Reddy) విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒంగోలులో వైసీపీ ఖాళీ అయిందని, అలాగే ప్రకాశం జిల్లా జడ్పీ పదవిని కూడా పడగొడతానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రకాశం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ(Prakasam District ZP Chairperson Buchepalli Venkayamma) స్పందించారు. బాలినేనికి సవాల్ విసిరారు. బాలినేనికి దమ్ముంటే తన కుర్చీని టచ్ చెయాలని ఛాలెంజ్ చేశారు.
తన ప్రాణం ఉన్నంత వరకు పదవులు, అధికారం ఉన్న లేకపోయినా వైఎస్ జగన్ వెంటే నడుస్తానని ఆమె చెప్పారు. బూచేపల్లి కుటుంబం బాలినేని లాగా లంచాలు తీసుకొని, బెదిరించి బతికే కుటుంబం కాదని ప్రకాశం జిల్లా ZPTC చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ స్పష్టం చేశారు. ఏ కారణంతో తన సీటును లాగేయాలనుకుంటున్నావో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పార్టీలో నుంచి వెళ్లిపోయినా బాలినేనిపై ఒంగోలులో కొంతమంది వైసీపీ నేతలకు అభిమానం ఉండేదని, పిఠాపురం సభతో మొత్తం పోయిందని చెప్పారు. 2029లో రాష్ట్రంలో కచ్చితంగా జగనే గెలుస్తారని వెంకాయమ్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాల్లోని వైసీపీ జడ్పీటీసీలంతా జగన్ వెంటే నడుస్తారని వెంకాయమ్మ పేర్కొన్నారు.