YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం.. తల్లి పిచ్చమ్మ కన్నుమూత
వైసీపీ (YCP) నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ (84) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆమె ఒంగోలు కిమ్స్ ఆస్పత్రి (Ongole KIMS Hospital)లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు బంధువులు, వైసీపీ (YCP) శ్రేణుల సందర్శనార్ధం పిచ్చమ్మ పార్థివ దేహాన్ని వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) నివాసం వద్ద ఉంచనున్నారు. మంగళవారం వైవీ సుబ్బారెడ్డి స్వగ్రామం మేదరమెట్లలో పిచ్చమ్మ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లుగా బంధువులు వెల్లడించారు. పిచ్చమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు కాసేపట్లో మాజీ సీఎం జగన్ (Former CM Jagan), విజయమ్మ, షర్మిల (Sharmila) వెళ్లనున్నారు.