BIG Alert: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లో పలు రైళ్లు ఆలస్యం
అనకాపల్లి (Anakapally) విజయరామరాజు పేట (Vijayarama Raju Peta) వద్ద రైల్వే వంతెన (Railway Bridge) కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్‌ను బలంగా ఢీకొట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి (Anakapally) విజయరామరాజు పేట (Vijayarama Raju Peta) వద్ద రైల్వే వంతెన (Railway Bridge) కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ పరిణామంతో రైల్వే వంతెన పూర్తిగా కుంగిపోయింది. అప్రమత్తమైన అధికారులు గోదావరి, విశాఖ, మహబూబ్ నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎక్కడికక్కడే నిలిచివేశారు. కశింకోట వద్ద గోదావరి (Godavari), విశాఖ ఎక్స్ ప్రెస్ (Vishakha Express Train) రైళ్లను నిలిపివేయగా.. ఎలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (Mahbubnagar Express)ను ఆపేశారు.
ఈ క్రమంలోనే పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తుండటంతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ (Visakhapatnam Railway Station)లో సమాచార కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. గోదావరి (Godavari), విశాఖ (Vishakha), సింహాద్రి (Simhadri), అమరావతి (Amaravati), గరీబ్‌రథ్ (Garibradh), మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (Mahbubnagar Express) రైళ్లు విశాఖ చేరుకోవడం ఆలస్యమవుతోందని వెల్లడించారు. రైళ్ల సమాచారం కోసం ప్రయాణికులు 0891 2746330, 0891 2744619, 87126 41255, 77807 87054 ఫోన్ నెంబర్లకు కాల్ చేసి సమాచారం తెలుసుకోవాలని పేర్కొన్నారు. రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విజరామరాజు పేట రైల్వే వంతెనకు మరమ్మతులు కొనసాగుతున్నాయి. ట్రాక్ పునరుద్ధరించిన వెంటనే రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగునున్నాయి.