Accident: పట్టాలు తప్పిన గూడ్స్.. పలు ట్రైన్ల రాకపోకలకు అంతరాయం
వరుస రైలు ప్రమాదాలు (Train Accidents) ప్రయాణికులను భయపెడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: వరుస రైలు ప్రమాదాలు (Train Accidents) ప్రయాణికులను భయపెడుతున్నాయి. రైలు ఎక్కాలంటే జనం ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) పెనుకొండ మండల పరిధిలోని మక్కాజిపల్లి రైల్వేస్టేషన్ (Makkajipet Railway Station) వద్ద గూడ్స్ రైలు (Good Train) పట్టాలు తప్పింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే, బెంగళూరు (Bengaluru) నుంచి ధర్మవరం (Dharmavaram) వెళ్తున్న గూడ్స్ రైలు మక్కాజిపల్లి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే ట్రాక్ మారే పాయింట్ వద్ద పట్టాలు తప్పింది. ఆంతో ఆ ట్రాక్‌పై వెళ్లే పలు రైళ్లు ఆస్యంగా నడుస్తున్నాయి. రైలు పట్టాలకు సంబంధించి బెంగళూరు (Bengaluru)లో ఎక్విప్‌మెంట్ (Equipment) అన్‌లోడ్ చేసి వస్తుండగా ప్రమాదం జరగిందని అధికారులు వెల్లడించారు. మక్కాజిపేట స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకునన్న రైల్వే అధికారులు, సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణలో నిమగ్నం అయ్యారు.