ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. స్పందించిన మంత్రి
కర్ణాటకలో ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడి ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు..

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక(Karnataka)లో ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్(APS RTC driver)పై బెంగళూరు(Bangalore)కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దాడి చేశారు. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో కర్ణాటక డ్రైవర్ రెచ్చిపోయారు. తోటి డ్రైవర్ అనే కనికరం లేకుండా విచక్షరణా రహితంగా పిడుగుద్దులు కురిపించారు. అంతటితో ఆగకుండా కిందపడేసి కాళ్లతో తన్నాడు. కొట్టొద్దని వేడుకుంటున్నా ముఖంపై కొట్టాడు. అయితే ఈ వివాదంలో కర్ణాటక డ్రైవర్‌దే తప్పని ప్రాథమికంగా తేలింది. దీంతో ఆ డ్రైవర్‌పై అక్కడి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
అయితే ఈ ఘటనపై ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి(AP Transport Minister Ramprasad Reddy) స్పందించారు. దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్‌కు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. స్నేహపూరిత వాతావరణంలో డ్రైవర్లు విధులు నిర్వహించాలని చెప్పారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం తొందరపాటు చర్య అన్నారు. బెంగళూరు ఆర్టీసీ డ్రైవర్ సంయమనం కోల్పోవడం విచారకరమని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.