72 గంటలు సమయం ఇస్తున్నా.. స్టార్ క్రికెటర్, సినీ నటులకు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్

72 గంటలు టైం ఇస్తున్నా.. చేసిన తప్పు ఒప్పుకోండి అని స్టార్ క్రికెటర్, సినీ నటులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2025-03-23 10:34 GMT
72 గంటలు సమయం ఇస్తున్నా.. స్టార్ క్రికెటర్, సినీ నటులకు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: 72 గంటలు టైం ఇస్తున్నా.. చేసిన తప్పు ఒప్పుకోండి అని స్టార్ క్రికెటర్, సినీ నటులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prajashanthi Party President KA Paul) స్ట్రాంగ్ వార్నింగ్ (Strong Warning) ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు (Betting Apps Promotion Case) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే ప్రముఖ నటులు రానా దగ్గుబాటి (Rana Dhagguabati), విజయ దేవరకొండ (Vijay Devarakonda), నటి నిథి అగర్వాల్ (Nidhi Agarwal) సహా సినీ ఆర్టిస్టులు (Artists), బిగ్ బాస్ స్టార్లు (Big Boss Stars), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు (Social Media Influencers) సహా పలువురిపై కేసు నమోదు అయ్యింది.

ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. కేసు నమోదు అయిన వ్యక్తులను పిలిచి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేఏ పాల్ సంచలన వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసిన ప్రముఖులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై పాల్.. ఆన్‌లైన్ స్కిల్ గేమ్స్ (Online Skill Games) పేరుతో బెట్టింగ్ యాప్ (Betting Apps) లను, వాటర్ బాటిల్ పేరుతో మందును, ఇలాచీ పేరుతో టోబాకోను కొందరు క్రికెటర్లు, నటులు, ఇన్ ఫ్లూయేన్సర్ల ముసుగులో ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. స్టార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కు బెట్టింగ్ యాప్ లు ప్రమోషన్ చేయడం అవసరమా అని ప్రశ్నించారు.

అలాగే విజయ్ దేవరకొండ, బాలకృష్ణ (Balakrishna), మంచు లక్ష్మీ (Lakshmi Manchu) లాంటి 25 మంది ప్రముఖులు తొందరలో అరెస్ట్ అవ్వబోతున్నారని చెప్పారు. పోలీసులు, రాజకీయ నాయకులు వారి దగ్గర డబ్బు తీసుకొని, అరెస్ట్ చేయకపోతే, వారందరినీ సుప్రీంకోర్టుకు తానే నడిపిస్తానని స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ (Prakash Raj) లాగా తప్పుయిందని ఒప్పుకొని, ఓపెన్ గా క్షమాపణలు చేప్పేంతవరకు ఎవరినీ వదిలిపెట్టనని తేల్చిచెప్పారు. అంతేగాక బెట్టింగ్ ప్రమోషన్ల ద్వారా వీరంతా నరహత్యకు పాల్పడ్డారని, మిమ్మల్ని అమితంగా అభిమానించే వారికి మీరిచ్చే బహుమతి ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు 72 గంటలు టైం ఇస్తున్నానని, ఆలోచించుకొని అందరు బయటికి వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News