కేసీఆర్ ఒక పెద్ద గుంట నక్క.. ఏపీ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెద్ద గుంట నక్క అని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు...

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Cm Kcr) ఒక పెద్ద గుంట నక్క(Fox) అని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు(AP BJP MLC Somu Veerraju) వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల(Bjp Leaders)పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాత్రి పూట నిద్రపోని.. ఊగిపోయే గుంట నక్క కేసీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడుకు, కూతురు, మేనల్లుడి అభివృద్ధినే కేసీఆర్ కోరుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు గుంట నక్కలు కాదని, రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంటారని చెప్పారు. రాష్ట్రాలను అభివృద్ధి చేసి అధికారం సాధించాలనేదే బీజేపీ లక్ష్యమన్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి తెలంగాణ(Telangana)ను కేసీఆర్ పదేళ్లు పాలించారన్నారు. మాయ మాటల మరాఠీ కేసీఆర్ అని విమర్శించారు. ఇప్పుడు జనం నమ్మకపోవడంతో బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలను గుంట నక్కలు అన్న కేసీఆర్.. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.