పర్యాటక స్థలానికి వెళ్లొస్తూ తిరిగి రాని లోకాలకు..

రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి జాతీయ రహదారి గుడేప్పాడ్ శివారు సమీపంలో జరిగింది.

Update: 2025-03-23 02:11 GMT
పర్యాటక స్థలానికి వెళ్లొస్తూ తిరిగి రాని లోకాలకు..
  • whatsapp icon

దిశ, హనుమకొండ : రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి జాతీయ రహదారి గుడేప్పాడ్ శివారు సమీపంలో జరిగింది. ఆత్మకూరు ఎస్సై పి.తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, (నర్సింగ్ తండా) మల్లె చెరువు తండాకు చెందిన కొర్ర రంజీత్ అనే యువకుడు శనివారం ములుగు జిల్లాలోని పర్యాటక స్థలమైన లక్నవరం వెళ్లి తిరిగి హనుమకొండ వైపు వెళ్లే క్రమంలో గుడేప్పాడ్ సమీపంలో రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనగా రంజిత్ అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.


Similar News