ఓవైపు అనారోగ్యం.. మరో వైపు ఆర్థిక ఇబ్బందులు.. ఏం చేశాడో తెలుసా ?

ఓవైపు అనారోగ్యం.. మరోవైపు పిల్లలకు బుద్ధి మాద్యం.. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు.. వెరసి కుటుంబ భారం మోయలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2025-03-25 15:07 GMT
ఓవైపు అనారోగ్యం.. మరో వైపు ఆర్థిక  ఇబ్బందులు.. ఏం చేశాడో తెలుసా ?
  • whatsapp icon

దిశ, తంగళ్ళపల్లి : ఓవైపు అనారోగ్యం.. మరోవైపు పిల్లలకు బుద్ధి మాద్యం.. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు.. వెరసి కుటుంబ భారం మోయలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో చోటు చేసుకుంది. చీర్లవంచ గ్రామానికి చెందిన మోగిలోజు విష్ణు (44) అనే వడ్రంగి కార్మికుడు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. విష్ణుకు పక్షవాతం, తన ఇద్దరు పిల్లలలో కుమారుడికి రేచీకటి, మంద బుద్ధి, కూతురుకు మానసిక ఎదుగుదల సరిగా లేకుండా ఉంది.

    తనకు పక్షవాతం కారణంగా ఏ పని చేయలేని స్థితిలో ఉన్న విష్ణు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన విష్ణు మంగళవారం తన ఇంటిలోని బాత్రూంలో ఇనుప రాడ్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విష్ణు భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Similar News