బంగారం షాప్ ఓనర్లను బురిడీ కొట్టించిన నకిలీ పోలీసులు..
చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసైన నలుగురు యువకులు ఈజీగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గత సంవత్సరం నుండి గోల్డ్ షాప్లను టార్గెట్ చేస్తున్నారు.
దిశ, హుజూర్ నగర్ : చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసైన నలుగురు యువకులు ఈజీగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గత సంవత్సరం నుండి గోల్డ్ షాప్లను టార్గెట్ చేస్తున్నారు. షాప్ యజమానులకు ఫోన్ చేసి మేము ఎస్సైలం ఇటీవల దొంగతనం జరిగిందని, ఆ దొంగలు మీ దుకాణంలోనే గోల్డ్ అమ్మినారని, ఆ బంగారం మీ నుండి రికవరీ చేయాలని, లేకపోతే కేసు పెట్టి జైల్ కు పంపుతామని బెదిరించి వారి నుండి డబ్బులు ఫోన్ పే చేయించుకున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసిన సంఘటన శనివారం హుజూర్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన చింతల చెర్వు ప్రశాంత్, నల్గొండ పట్టణం మన్యం చేల్కకు చెందిన షేక్ ఇర్ఫాన్, నల్గొండ పట్టణంలోని హైమద్ నగర్ కు చెందిన షేక్ వాజిద్, నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన చింతల చెరువు అక్షిత్ కుమార్ అనే నలుగురు యువకులు చెడు అలవాట్లకు బానిసైనారు. ఈజీగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో సంవత్సరం నుండి గూగుల్ లో ఎస్సైల ఫోటోలు డౌన్ లోడ్ చేసుకొని ఆ ఫోటోను ట్రూ కలర్ డీపీగా పెట్టుకుని, గూగుల్ మ్యాప్ లో బంగారం షాప్ ల వివరాలు, యాజమానుల వివరాలు స్వీకరించి, నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళి మీ ఫలానా పోలీస్ స్టేషన్ నుండి ఎస్సైని మాట్లాడుతున్నాననే వారన్నారు.
తాము కొంతమంది దొంగలను పట్టుకున్నామని, వారు మీ బంగారం షాప్ లో దొంగలించిన బంగారం అమ్మినారని అంటారన్నారు. ఆ బంగారం మీ నుండి రికవరీ చెయ్యాలి, లేకపోతే కేసు పెట్టి జైల్ కు పంపుతామని బెదిరించి వారి నుంచి డబ్బులు ఫోన్ పే చేపించుకుంటున్నారన్నారు. అదే విధంగా ఈనెల 1న మధ్యాహ్నం సమయంలో నేరస్తుడైన చింతల చెర్వు ప్రశాంత్ తిరుమలగిరి గ్రామానికి చెందిన శివ కుమార్ అనే జువెలరీ షాప్ యజమానికి ఫోన్ చేసి తాను రాజంపేట ఎస్సైని మాట్లాడుతున్నానని, నువ్వు దొంగల వద్ద బంగారం కొన్నావు, నీపైన కేసు కాకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఫోన్ పే చెయ్యమని కోరగా అతను భయపడి 52 వేల రూపాయలు పంపారని తెలిపారు. ఈనెల 8న మధ్యాహ్నం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన శ్రీనిధి జ్యువలరీ షాప్ యజమాని తుడిమల్ల నవీన్ కుమార్ కు ఫోన్ చేసి నేను కుప్పం ఎస్సై ని మాట్లాడుతున్నానని నువ్వు కొంతమంది దొంగల నుండి బంగారం కొన్నావని ఆ బంగారం రికవరీ చెయ్యాలని లేకపోతే నీ పైన కేసు పెట్టి జైల్ కు పంపుతామని బెదిరించగా అతను భయపడి వారు చెప్పిన ఫోన్ ప్లే నెంబర్ కు 10 వేలు రూపాయలు పంపించారు. వారిపై అనుమానం ఉందని ఆ బంగారం షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు పై హుజూర్నగర్ ఎస్సై ముత్తయ్య దర్యాప్తు చేపట్టారని తెలిపారు. శనివారం సాయంత్రం 4:00 సమయంలో హుజూర్ నగర్ ముత్తయ్య తన సిబ్బందితో కలిసి గోపాలపురం గ్రామశివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు నేరస్తులు రెండు మోటార్ సైకిలపై కోదాడ వైపు వెళ్తుండగా వారిని పట్టుకొని విచారణ చేసామన్నారు. ఈ విచారణలో వారు చేసిన దొంగతనాలను తప్పులను ఒప్పుకున్నారని సీఐ చరమంద రాజు తెలిపారు. వారి వద్ద ఉన్న రెండు మోటార్ సైకిల్ నాలుగు సెల్ ఫోన్లు 24,900 రూపాయలను స్వాధీనపరచుకొని కోర్టు నందు ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
Read Also..
19 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్.. వారిలో ఎక్కువ మంది ఆ ఫీల్డ్ వారే..