ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి, మరొకరి పరిస్థితి విషమం అయినా ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది

దిశ, ఇబ్రహీంపట్నం : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి, మరొకరి పరిస్థితి విషమం అయినా ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదిబట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నుండి రావిర్యాలకు ద్విచక్ర (కెటియం) వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఏసిసి ప్లాంట్ సమీపంలోకి చేరుకోగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కన ఉన్న గోడను ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న వ్యక్తులలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి, గాయపడి పరిస్థితి విషమం అయినా వ్యక్తులు హయత్ నగర్ చెందిన వారీగా ఆదిబట్ల పోలీసులు గుర్తించారు. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.