రక్తహీనతతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

దుమ్ముగూడెం మండలంలోని నారాయణరావుపేట ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థి సోయం సుకుమార్ (12) అనారోగ్య సమస్యలతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచాడు.

Update: 2025-03-21 15:46 GMT
రక్తహీనతతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
  • whatsapp icon

దిశ,దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలోని నారాయణరావుపేట ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థి సోయం సుకుమార్ (12) అనారోగ్య సమస్యలతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచాడు. ఈ నెల 13వ తేదీన విద్యార్థికి జ్వరం రావడంతో పాఠశాలలోని ఏఎన్‌ఎం ప్రాథమిక చికిత్సగా కొన్ని మాత్రలు అందించింది. అయితే, 14వ తేదీన విద్యార్థి తల్లి అతడిని ఇంటికి తీసుకెళ్లి, దగ్గర్లో ఉన్న అర్హత లేని వైద్యుల వద్ద చికిత్స చేయించడంతో పాటు సాంప్రదాయ నాటు వైద్యం కూడా అందించారు. అయితే, ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో 17వ తేదీన దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రక్తహీనత ఎక్కువగా ఉందని భావించి, భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడని వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Similar News