వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం లభ్యం
న్యాల్కల్ మండలం వడ్డీ గ్రామానికి చెందిన శివకుమార్ (19) అనే యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
దిశ, జహీరాబాద్: న్యాల్కల్ మండలం వడ్డీ గ్రామానికి చెందిన శివకుమార్ (19) అనే యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. హోలీ పర్వదినాన సదరు యువకుడు వ్యవసాయ బావిలో స్నానానికి వెళ్లి మృతి చెందాడు. మృతుడి తల్లి ఒడ్డనూర్ గాలమ్మ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. హోలీ పండుగ సందర్భంగా తన స్నేహితులైన కుమ్మరి ఆనంద్ కుమార్, ఉప్పరి దీపక్, పరునూర్ మాణిక్, కమ్మరి చంద్రకాంత్, మ్యాథరి వెంకటేష్, గార్లతో హోలీ పండుగ జరుపుకున్న అనంతరం శంషాల్లాపూర్ గ్రామ శివారులోని అప్పారావు పటేల్ వ్యవసాయ భూమిలో స్నానం కోసం వెళ్ళారు. బావి దగ్గర అందరూ కలిసి మద్యం సేవించి అనంతరం ఈతకు ఉపక్రమించారు.
బావిలో ఈదుతుండగా ఈత రాని ఆనంద్ కుమార్ బావి ఒడ్డున కూర్చోగా ఈత రాని శివకుమార్ నడుముకు తాడు కట్టుకొని ఈదేందుకు బావిలోకి దిగి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలుపగా వారు బావిలో గాలించగా ఆచూకీ లభించలేదు. దీంతో మృతుడి తల్లి ఒడ్డనూర్ గాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. శనివారం గజ ఈతగాళ్లతో బావిలో గాలింపు చర్యలు చేపట్టగా శివకుమార్ మృతదేహం లభించినట్లు ఎస్ఐ. చెల్లా రాజశేఖర్ చెప్పారు. మృతదేహాన్ని బయటకు తీసి శవ పంచనామా నిర్వహించిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివకుమార్ మరణంపై వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా కెమికల్ అనాలిసిస్ గురించి ఎఫ్ ఎస్ ఎల్ కు అవసరమైన అవయవాలు పంపపినట్లు హద్దునూర్ ఎస్సై చల్లా రాజశేఖర్ పేర్కొన్నారు.
Read Also..
యువకుడిని కొట్టించి.. విషం తాగించిన మాజీ ప్రియురాలు.. కారణం ఏంటంటే?