రోడ్డు ప్రమాదంలో బీఆర్​ఎస్​ గ్రామ అధ్యక్షుడు మృతి

ద్విచక్ర వాహనం అదుపు తప్పి బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆదివారం మృతి చెందాడు.

Update: 2025-03-16 10:51 GMT

దిశ, దుగ్గొండి : ద్విచక్ర వాహనం అదుపు తప్పి బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆదివారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన బొంతల సాయి కుమార్ ఆదివారం నీరుకుళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పెంచికలపేట గౌడ సంఘం భవనం వద్ద కుక్క ఎదురుగా రావడంతో తప్పించబోయి అదుపుతప్పి డివైడర్ కు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

    స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటనే సాయి కుమార్ మృతదేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సుఖినే రాజేశ్వర్ రావు, నాయకులు వైనాల మురళి, కోదాటి నాగేందర్, కలకోటి రాజేష్ ఉన్నారు. 


Similar News