పీర్జాదిగూడలో విషాదం.. వాటర్ సంప్ క్లీన్ చేస్తూ బీటెక్ విద్యార్థి మృతి

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Update: 2025-03-16 16:15 GMT

దిశ, మేడిపల్లి : మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి ఓనర్ కి సంబంధించి సంపు క్లీన్ చేస్తూ ఊపిరి ఆడక బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడలోని బుద్ధానగర్ ప్రాంతంలో తల్లితో ఉంటున్న గణేష్(19) పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.

    ఇంటి ఓనర్ శ్రీహరికి మల్లికార్జున నగర్, బుద్ధనగర్లలో ఇండ్లు కలవు. బుద్ధనగర్ లో గణేష్ తన తల్లితో నివాసం ఉంటున్నాడు. గణేష్ ను మల్లికార్జున నగర్ లోని ఇంటి సంపులో క్లీనింగ్ కోసం సంపులోకి దింపారు. యాసిడ్, బ్లీచింగ్ పౌడర్ అందులో వేసి ఉండటంలో సంపులోకి దిగిన గణేష్ కి ఊపిరి ఆడక మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు. 


Similar News