Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం

ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం పాలైన విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరడా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Update: 2025-03-17 05:00 GMT
Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం
  • whatsapp icon

దిశ, షాద్‌నగర్: ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం పాలైన విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరడా రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) రోడ్డు ప్రమాదంలో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News