అట‌వీశాఖ రేంజ్ అధికారి బాల‌రాజు అరెస్ట్‌

2023 సంవ‌త్స‌రంలో ఏటూరునాగారం అట‌వీ శాఖ‌ ఇన్చార్జ్ రేంజ్ అధికారిగా ప‌నిచేసిన బాల‌రాజును శ‌నివారం ఏటూరునాగారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు త‌ర‌లించారు.

Update: 2025-03-22 16:08 GMT
అట‌వీశాఖ రేంజ్ అధికారి బాల‌రాజు అరెస్ట్‌
  • whatsapp icon

దిశ‌, ఏటూరునాగారం : 2023 సంవ‌త్స‌రంలో ఏటూరునాగారం అట‌వీ శాఖ‌ ఇన్చార్జ్ రేంజ్ అధికారిగా ప‌నిచేసిన బాల‌రాజును శ‌నివారం ఏటూరునాగారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు త‌ర‌లించారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ క‌థ‌నం మేర‌కు వివ‌రాలు ఇలా ఉన్నాయి. 2023 సంవ‌త్స‌రంలో ఏటూరునాగారం, క‌న్నాయిగూడెం ఇన్చార్జి రేంజ్ అధికారిగా ప‌నిచేసిన ఎస్.బాల‌రాజు అనే అధికారిని అరెస్ట్ చేసి కోర్టుకు త‌ర‌లించిన‌ట్లు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ వెల్ల‌డించారు.

     తునికాకు కూలీల బోన‌స్ డ‌బ్బులు 2 లక్ష‌ల 70 వేల రూపాయ‌లు అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు స్థానిక ఫారెస్ట్ అధికారులు ఏటూరునాగారాం పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయ‌డంతో విచార‌ణ చేప‌ట్టి శ‌నివారం అరెస్ట్ చేసి కోర్టుకు త‌ర‌లించినట్టు తెలిపారు. కాగా అట‌వీ శాఖ అధికారిగా విధులు నిర్వ‌హిస్తున్న బాల‌రాజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అకౌంట్లో న‌గ‌దు బోన‌స్ డ‌బ్బులు ప‌డ‌డంతో వాటిని డ్రా చేయింకొని త‌న సొంతానికి వాడుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఎవ‌రైనా అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డితే చూస్తూ ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీ‌నివాస్‌, ఎస్ఐ తాజుద్దీన్ పాల్గొన్నారు. 


Similar News