Accident: జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. ఏకంగా మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి..
హైదరాబాద్ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో వరుస రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ఆందోళన కలిగిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో వరుస రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున ఓ కారు కృష్ణానగర్ (Krishna Nagar) నుంచి జూబ్లీహిల్స్ (Jubilee Hills) చెక్‌పోస్ట్ వైపు వెళ్తుంది. అయితే, ఉన్నట్టుండి కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ (Metro Pillar)తో పాటు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా కారు ప్రమాదానికి గురికావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం ధాటికి కారు వెనకాల ఉన్న టైర్ కూడా ఊడిపోయింది. అయితే, డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.